Begin typing your search above and press return to search.

దాసరి ఇంకా ఆస్పత్రిలోనే..

By:  Tupaki Desk   |   5 March 2017 12:51 PM GMT
దాసరి ఇంకా ఆస్పత్రిలోనే..
X
దర్శకరత్న దాసరి నారాయణ రావు కొన్ని వారాల క్రితం కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఇంకా హాస్పిటల్ లోనే ఉండడం చాలామందిలో ఆందోళన రేకెత్తించింది. సీనియర్ నటులు నరేష్.. శివాజీ రాజాలు దాసరిని దర్శించుకునేందుకు వెళ్లి ఫోటో ఒకటి బైటకు రావడంతో ఈ విషయం బైటపడింది.

దాసరిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న వీరు.. ఆయన ఆరోగ్యంపై క్షేమ సమాచారాలు కనుకున్నారు. ఇదిలా ఉంటే.. దాసరి ఇంకా ఆస్పత్రిలో ఉండడంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలుస్తోంది. కిడ్నీ.. లివర్.. లంగ్ సమస్యలతో డయాలసిస్ చేయించుకోవడంతో పాటు.. కొన్ని రోజుల పాటు వెంటిలేటర్ పై కూడా ఉన్నారు దాసరి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఢోకా ఏం లేదని.. మరికొన్ని రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారని డాక్టర్ చెబుతున్నారు.

లంగ్ ఇన్ఫెక్షన్.. కిడ్నీ సమస్యలపై ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచారట. అందుకే ఇన్ని రోజులు కిమ్స్ లోనే ఉండిపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. మరి కొన్నాళ్లు హాస్పిటల్ లో అబ్జర్వేషన్ లో ఉండనుండగా.. పూర్తిగా కోలుకున్నాక ఆయన్ను డిశ్చార్ఝ్ చేయనున్నట్లు చెబుతున్నారు కిమ్స్ వైద్యులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/