Begin typing your search above and press return to search.

రూపాయి జీతానికి దాస‌రి ప‌ని చేశారు తెలుసా?

By:  Tupaki Desk   |   31 May 2017 4:11 AM GMT
రూపాయి జీతానికి దాస‌రి ప‌ని చేశారు తెలుసా?
X
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ముఖుడిగా కీర్తి ప్ర‌తిష్ట‌లు అందుకున్న వారిలో దాస‌రి నారాయ‌ణ‌రావు ఒక‌రు. సినిమా ప్ర‌ముఖుడిగా పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ముద్ర సినిమాల‌కు మాత్ర‌మే కాదు.. అనేక ఇత‌ర రంగాల‌నూ ప్ర‌భావితం చేశారు. ఆయ‌న‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చూస్తే..

+ 151 చిత్రాల‌ను తెర‌కెక్కించ‌టం.. నిర్మాత‌గా 53 సినిమాలు తీయ‌టం ఒక ఎత్తు అయితే.. 250కి పైగా సినిమాల‌కు మాట‌లు.. పాట‌లు అందించిన స‌త్తా దాస‌రి సొంతం. మామ‌గారు.. సూరిగాడు.. అమ్మ రాజీనామా..ఒసేయ్ రాముల‌మ్మ‌.. మేస్త్రీ.. ఎర్ర‌బ‌స్సుల్లాంటి సినిమాల్లో న‌టించారు.

+ సినిమాల ద్వారా సామాజిక అంశాలే కాదు.. వ‌ర్త‌మాన అంశాల్ని.. స్త్రీల‌కు జ‌రుగుతున్న అన్యాయాల్ని ఒసేయ్ రాముల‌మ్మ‌.. స‌మ్మ‌క్క సారక్క చిత్రం ద్వారా ఎలుగెత్తి చాటారు. ఉద‌యం దిన‌ప‌త్రిక‌ను ఏర్పాటు చేయ‌టం.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కేంద్ర‌మంత్రిగా బాధ్య‌త‌లు చేపట్టారు.

+ న‌టుడిగా.. పాట‌ల ర‌చ‌యిత‌గా..మాట‌ల ర‌చయిత‌గా..రంగ‌స్థ‌ల న‌టుడిగా.. గిన్నిస్ బుక్ కు ఎక్కిన ద‌ర్శ‌క‌.. నిర్మాత‌గా ఆయ‌న‌కు పేరుంది.

+ సినిమా రంగాన్ని ప‌క్క‌న పెడితే ఆయ‌న‌లో రాజ‌కీయ వేత్త‌.. పాత్రికేయులు.. ప‌త్రికాధిప‌తి.. వ్యాస ర‌చ‌యిత‌.. వ్యంగ్య ర‌చ‌యిత ఉండేవారు. దాన్ని బ్రేక్ చేశారు దాస‌రి.

+ ఇలా బ‌హుముఖంగా ప‌ని చేసిన దాస‌రి ఒక‌ప్పుడు వండ్రంగి ప‌ని చేసేవారు. అప్ప‌ట్లో ఆ ప‌ని చేసినందుకు దాస‌రికి ద‌క్కింది ఎంతో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. వ‌డ్రంగి ప‌నికి వెళ్లిన స‌మ‌యంలో నెల జీతంగా ఆయ‌న రూపాయి మాత్ర‌మే.

+ దాస‌రి సినిమా రంగంలో ప్ర‌వేశించే స‌మ‌యానికి ఒక సామాజిక వ‌ర్గ పెత్త‌న‌మే న‌డిచేది. దాన్ని బ్రేక్ చేయ‌టం దాస‌రికే సాధ్య‌మైంది. ప‌త్రికా రంగంలోనూ ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది.
తెలుగోడి ముద్దుబిడ్డగా దాస‌రిని ప‌లువురు అభివ‌ర్ణిస్తారు. మ‌ద్రాస్‌లో ఉన్న టాలీవుడ్‌ను ఏక‌తాటి మీద హైద‌రాబాద్ కు త‌ర‌లించ‌టం.. ఉద్య‌మ‌స్ఫూర్తిని నింపి.. ఈ రోజు హైద‌రాబాద్ లో చిత్ర‌ప‌రిశ్ర‌మ ఉందంటే కార‌ణం దాస‌రిగా చెబుతారు.

+ తెలుగోడి గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి చాటిన ఎన్టీవోడి రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి అవ‌స‌ర‌మైన సినిమాల్ని అందించింది మాత్రం దాస‌రి నారాయ‌ణ‌రావే.

+ దాస‌రి కుటుంబానికి ఆస్తిపాస్తులు బాగానే ఉండేవ‌ని చెబుతారు. వారి ఫ్యామిలీ పొగాకు వ్యాపారం చేసేది. ఒక‌సారి గోడౌన్ త‌గ‌ల‌బ‌డ‌టంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింద‌ని చెబుతారు. దాస‌రి తండ్రికి ఆరుగురు సంతానం. ముగ్గురు మ‌గ‌పిల్ల‌లు.. ముగ్గురు ఆడ‌పిల్ల‌లు. దాస‌రి మూడోవాడు. దాస‌రి ఆరో త‌ర‌గ‌తి చ‌దివే స‌మ‌యానికి వారింట్లో ఆర్థిక ఇబ్బందులు వ‌చ్చి ప‌డ్డాయి. స్కూల్ ఫీజుకింద కట్టాల్సిన రూ.3 కూడా క‌ట్టేలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో చ‌దువుకు ఫీజు క‌ట్ట‌లేక రూపాయి నెల‌స‌రి జీతానికి వ‌డ్రంగి ప‌నిలో చేర్చారు.

+ వ‌డంగ్రి ప‌ని చేసే స‌మ‌యంలో ఒక వ్య‌క్తి చేసిన సాయంతో చ‌దువుకోవ‌టం మొదలెట్టిన దాస‌రి బీఏ వ‌ర‌కూ చ‌దివారు. క‌ళాశాల నుంచి నాట‌కాలు వేస్తూ.. అంద‌రి దృష్టిలో ప‌డ్డారు. తాతా మ‌న‌మ‌డు.. స్వ‌ర్గం న‌ర‌కం లాంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు.

+ ప‌లువురు అగ్ర‌హీరోల‌తో సినిమాలు చేసిన దాస‌రి ఇమేజ్ ఎంతంటే.. ఒక‌ద‌శ‌లో ఆయ‌న‌కు 18వేల అభిమాన సంఘాలు ఉండేవి. హీరోల‌కు స‌మానంగా ద‌ర్శ‌కుల‌కు పేరు తెచ్చిన వ్య‌క్తిగా చెప్పొచ్చు.

+ తొంభైల‌లో ఆయ‌న తెలుగుత‌ల్లి పేరుతో ఒక రాజ‌కీయ పార్టీని స్థాపించారు దాస‌రి. కానీ.. దాన్ని న‌డిపించ‌టంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యారు. కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌రైన ఆయ‌న‌.. చివ‌రి వ‌ర‌కూ ఆ పార్టీలోనే ఉన్నారు. ఉద‌యం ప‌త్రిక‌తో సంచ‌ల‌నం రేపిన దాస‌రి.. అప్ప‌టికే అగ్ర‌ప‌త్రిక‌గా ఉన్న ఈనాడుకు స‌వాలు విసిరిన స‌త్తా దాస‌రి సొంతంగా చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/