Begin typing your search above and press return to search.

ఆ సినిమా చూసి సిగ్గుపడ్డాను

By:  Tupaki Desk   |   14 Dec 2015 5:14 AM GMT
ఆ సినిమా చూసి సిగ్గుపడ్డాను
X
అల‌నాటి మేటి ద‌ర్శ‌కుల్లో కేవీ రెడ్డి ఒక‌రు. ఆయ‌న మేటి క్లాసిక్స్ ఎన్నిటికో ద‌ర్శ‌క‌నిర్మాత‌గా - ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు. తెలుగు సినిమా స్వ‌ర్ణ యుగంలో తొలిత‌రం ద‌ర్శ‌కుడిగా కీల‌క‌పాత్ర ఆయ‌న‌ది. స‌త్య హ‌రిశ్చంద్ర‌ - శ్రీ‌కృష్ణార్జున యుద్ధం - జ‌గ‌దేకవీరుని క‌థ‌ - పెళ్లినాటి ప్ర‌మాణాలు వంటి క్లాసిక్స్‌ ని నిర్మించారు. చారిత్రాత్మ‌క చిత్రాలు పాతాళ భైర‌వి - గుణ‌సుంద‌రి క‌థ‌ - యోగి వేమ‌న వంటి క్లాసిక్స్‌ కి స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే అంత‌టి మ‌హ‌నీయుడి పేరు మీద ఉన్న అవార్డు నేటి త‌రం ద‌ర్శ‌కుల‌కు రావ‌డం అంటే అరుదైన విష‌య‌మే.

కానీ ఆ అరుదైన స‌త్కారాన్ని గుణ‌శేఖ‌ర్ అందుకున్నారు. నిన్న‌టిరోజున ఆయ‌న‌కు హైద‌రాబాద్‌ లో యువ‌క‌ళావాహిణి ఆధ్వ‌ర్యంలో స‌న్మానం జ‌రిగింది. ఈ స‌న్మాన స‌భ‌లో ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు గుణ‌శేఖ‌రునికి పుర‌స్కారాన్ని అందించి స‌న్మానించారు. అస‌లు కేవీరెడ్డి - బిఎన్ రెడ్డి పేర్ల‌తో ఉన్న అవార్డుల్ని తీసేయ‌మ‌ని అన్నాను నిర్వాహ‌కుల‌తో. ఈ త‌రం దర్శ‌కుల్లో క్వాలిటీ డైరెక్ట‌ర్స్ చాలా త‌క్కువ మంది ఉన్నారు. అందుకే అలా చెప్పాను. కానీ ఆ అవార్డుకు గుణ‌శేఖ‌ర్ అర్హుడు. రుద్ర‌మ‌దేవి వంటి గొప్ప సినిమాని తెర‌కెక్కించాడు.. అని ప్ర‌శంసించారు. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన సొగ‌సు చూడ‌త‌ర‌మా.. చూసి సిగ్గుప‌డ్డాను అని దాస‌రి అన్నారు.

ఒక‌వేళ దాస‌రి పేరు మీద అవార్డు క్రియేట్ చేస్తే అది గెలుచుకునేందుకు పోటీప‌డ‌తాన‌ని గుణ‌శేఖ‌ర్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించ‌డం విశేషం.