Begin typing your search above and press return to search.
అందుకే దాసరి ఆ రోజు రాలేదా?
By: Tupaki Desk | 3 May 2016 1:39 PM GMTమొన్నామధ్యన.. పూరి జగన్ ఇచ్చిన కంప్లయింట్ పై స్పందించడానికి కొందరు పంపిణీదారులు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా దాసరి వారి అధ్యక్షతన ప్రెస్ మీట్ జరుగుతుందని తెలిపాక.. చివరకు అక్కడకు దాసరి రాలేదు. ఎందుకు అని అడిగితే.. అబ్బే ఆయన్నుపిలువలేదు.. కావాలంటే ఆయన వస్తారు అంటూ అక్కడ కొంతమంది రిప్లయ్ ఇచ్చారు. కాని అందులో ఇంకో యాంగిల్ ఉన్నట్లుంది.
ఈ పంపిణీదారుల గోల.. అండ్ రెమ్యూనరేషన్లను తిరిగిచ్చేయడం అనే అంశంపై స్పందించమంటే.. దాసరి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ''సినిమా నష్టపోతే ఆ నిర్మాతకు హీరో కానీ, దర్శకుడు కానీ తిరిగి డేట్స్ ఇచ్చి సహాయం చేయడం గతంలో ఉండేది. కానీ దర్శకున్ని కానీ, హీరోను కానీ రెమ్యూనరేషన్స్ తిరిగి ఇచ్చేయమనటం కరెక్ట్ కాదు. 20 నుండి 30 వరకు నష్టపోతే ఎవరూ చేసేదేమీలేదు'' అంటూ స్పందించారు ఆయన. అయితే కొందరు తిరిగిస్తున్నారు.. అది వారి సొంత అభిప్రాయం అంటున్నారు.
ఇకపోతే.. ఒకవేళ పంపిణీదారులు ఎవరైనా తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే.. అప్పుడు సదరు దర్శకుడు అండ్ హీరో కూడా నాకేంటి నేనెందుకు ఇవ్వాలి.. అసలు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అనడటం కూడా కరెక్టు కాదు అని దాసరి స్పందించారు. ఇలా దాసరి వారు ఎవరి తరుపునా మాట్లాడకుండా.. అందరికీ కలిపే చికెన్ పలావ్ పెట్టారనమాట. అందుకే ఆ రోజు వచ్చుండరు.