Begin typing your search above and press return to search.
#MB40: చరిత్రలో మిగిలిపోయే ఇనిస్టిట్యూషన్
By: Tupaki Desk | 17 Sep 2016 5:12 PM GMTమోహన్ బాబు అనుక్షణం తన గురువు దాసరి నారాయణరావును పొగడకుండా ఉండరు. అటవుంటి దాసరి తన గ్రేట్ శిష్యుడి గురించి ఏమని చెప్పారు? పదండి చూద్దాం.
''ఫంక్షన్లకు రాని వెంకటేష్.. బొంబాయ్ నుండి వచ్చిన శ్రీదేవి.. భర్తకు బాలేకపోయినా విచ్చేసిన జయసుధ.. అలాగే యంగ్ స్టార్స్.. వీరందరూ ఇవాళ వచ్చారంటే.. దీనికి కారణం సుబ్బిరామి రెడ్డి పిలుపు మోహన్ బాబు గుండె మలుపు. ఎక్కువ కాలం నిలబడిన ఆర్టిస్టులందరూ విలన్లగా ప్రారంభించినవారే. వీరే టాప్ యాక్టర్లు అవుతారు. వినోద్ కన్నా.. శతృఘ్నసిన్హా.. రజనీకాంత్.. మోహన్ బాబు అండ్ చిరంజీవి.. వీళ్లందరూ విలన్లుగా మొదలెట్టి హీరోలు అయ్యారు. వీరు ఆల్ రౌండ్ నటులు'' అంటూ చెప్పారు దాసరి నారాయణరావు.
ఇక మోహన్ బాబు అసలు నటుడిగా ఎలా సెలక్ట్ అయ్యారో దాసరి వివరించారు. ''ఎన్నో స్ర్కీనింగుల తరువాత మోహన్ బాబును స్వర్గం నరకం సినిమా కోసం సెలక్ట్ చేశాను. తనలో మ్యాటర్ ఉందే కాబట్టి సెలక్ట్ అయ్యాడు. విలన్ గా మొదలెట్టి హీరో అయ్యాడు. జయప్రద అండ్ మోహన్ బాబు హీరోహీరోయిన్లు అంటే ఇండస్ర్టీలో నవ్వారు. కాని వారి తొలిసినిమా 100 డేస్ ఆడింది. కేవలం నాలుగు సినిమాలు ఇస్తే వారు పెరిగిపోరు. వాళ్ళలో స్వయంకృషి ఉండాలి. అప్పుడే ఎదుగుతారు. 7 గంటలకు షూటింగ్ అంటే.. 7 గంటలకు మేకప్ వేసుకుని సెట్ కు వచ్చి.. ఒక చరిత్రకారుడు అయ్యాడు'' అన్నారు.
''చిరంజీవి-మోహన్ బాబు బయటకు తిట్టుకుంటున్నట్లు ఉంటారు. కాని లోపల ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒక్కసారి స్నేహం చేస్తే మోహన్ బాబు వదిలిపెట్టడు. సినిమా వాళ్లతోనే కాదు.. బయటవారితో కూడా అలాగే స్నేహం చేస్తాడు. ఈరోజుకు ఒక ఇనిస్టిట్యూషన్ లా మారాడు. ఎవరు ఉన్నా పోయినా మోహన్ బాబు స్థాపించిన విద్యానికేతన్ ఇనిస్టిట్యూషన్ మాత్రం చరిత్రలో ఉండిపోతుంది'' అంటూ దాసరి ముగించారు.