Begin typing your search above and press return to search.

చైతన్య-సమంత.. దాసరి కామెంట్స్

By:  Tupaki Desk   |   20 Sep 2016 6:54 PM GMT
చైతన్య-సమంత.. దాసరి కామెంట్స్
X
ఇప్పటికే యంగ్ హీరో నాగ చైతన్య కుర్ర హీరోయిన్ సమంతతో చెట్టాల్ పట్టాల్ అంటూ తిరగడం ఊరంతా పాపులర్ అయిపోయింది. అలాగే కింగ్ నాగార్జున ఆమెను ఒక పెళ్ళిలో అందరికీ పరిచయం చేయడంతో.. ఇక విషయం చాలా ఓపెన్ అయిపోయిందంతే. ఇప్పుడైతే ఆమె పేరును తీయకుండా దాదాపు టాప్ సెలబ్రిటీలు అందరూ కన్ఫామ్ చేసేస్తున్నారు. గత రాత్రి దాసరి కూడా సమంత అండ్ చెయ్ పై ఆసక్తికరమైన కామెంట్లే చేశారు.

''చైతన్య నవ్వు బాగుంటుంది. మరి ఏ మాయ చేశాడో కాని.. ఒక హీరోయిన్ ను పడేశాడు. అలాగే ఏ మాయ చేశావేతో ఆ హీరోయిన్ కూడా ఏ మాయ చేసిందో..'' అంటూ చెప్పకనే చెప్పేశారు దాసరి నారాయణరావు. అసలు దాసరి ఈ కామెంట్ చేస్తారని ఎవ్వరూ ఊహించే ఉండరు. ఇక ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడిన దాసరి.. ''నాకు కావల్సినవారు.. రావల్సినవారు.. అనుకుంటేనే నేను వస్తాను. అందుకే ఈ కార్యక్రమానికి వచ్చాను. నేను అక్కినేనితో 28 సినిమాలు చేస్తే అందులో 22 సినిమాలు లవ్ స్టోరీసే. ప్రేమాభిషేకం మరో 20 ఏళ్ళు అలాగే ఉంటే మాత్రం.. 100 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో అది మరో రికార్డు అవుతుంది. నాగ్ కెరియర్ లో ఒక మజ్నూ సూపర్ హిట్. అలాగే చైతన్యకు ఈ లవ్ స్టోరీ పెద్ద హిట్టవ్వాలి. ఇక అఖిల్ కూడా ప్రేమ కథలే చేయాలి'' అంటూ సెలవిచ్చారు గురువు గారు.

హీరోయిన్ శృతి హాసన్ గురించి మాట్లాడుతూ.. ''శృతి హాసన్.. సారిక రెప్లికా.. నాతో 5 సినిమాలు చేసింది.. పెర్ఫామర్. డ్యాన్సర్. గ్లామర్ డాల్'' అంటూ పొగిడేశారు. నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుతూ తన ప్రసంగాన్ని ముగించారు.