Begin typing your search above and press return to search.

చందు గురించి ముగ్గురు ఏమన్నారంటే..

By:  Tupaki Desk   |   20 Sep 2016 6:49 PM GMT
చందు గురించి ముగ్గురు ఏమన్నారంటే..
X
నిజానికి ''కార్తికేయ'' వంటి సినిమాను తీసిన చందు మొండేటి.. ఆ తరువాత మనోడు ఏ సినిమా తీస్తాడా అని అందరూ ఎదురు చూశారు. అయిత అనూహ్యంగా ఈ దర్శకుడు మాత్రం ఒక రీమేక్ సినిమాను ఎంచుకున్నాడు. అసలు మొదటి సినిమాలో సైన్స్ ఫిక్షన్లోనే పీక్స్ చూపించిన ఈ దర్శకుడు ఇప్పుడు రీమేక్ తీస్తున్నాడంటే.. అది చాలా పెద్ద ఫీట్ అంటున్నారు కొందరు సంచలన దర్శకులు.

''రీమేక్ చేయడం చాలా కష్టం. కత్తిమీద సాము లాంటిది. కాబట్టి ఈ సినిమాను చందూ చాలా బాగా హ్యాండిల్ చేశాడని అనుకుంటున్నాను. అతను తీసిన కార్తికేయ సినిమా చాలా బాగుంది. అతను యుజువల్ కాదు అనూజువల్ డైరక్టర్'' అంటూ స్వయంగా దర్శకరత్న దాసరి నారాయణరావు కామెంట్ చేశారు. అసలు రీమేక్ సినిమాలకే వ్యతిరేకం అయిన ఈ వెటరన్.. చందు చేసిన వర్కును ఇలా మెచ్చుకోవడం అంటే అందరికీ షాకింగే.

అలాగే సోగ్గాడే చిన్నినాయన సినిమాను తీసిన దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ.. ''రీమేక్ కష్టం.. ఎక్కువ చేసినా కష్టమే తక్కువ చేసిన కష్టమే. అందుకే చందుని ప్రశంసిస్తున్నా'' అన్నాడు. ఇక స్వామిరారా ఫేం సుధీర్ వర్మ అయితే ఒక సిన్సియర్ కన్ఫెషన్ ఇచ్చేశాడు. ''దోచెయ్ తో నేను డిజప్పాయింట్ చేసినా.. నా ఫ్రెండ్ చందూ కాంపెన్సేట్ చేస్తాడు'' అంటూ తన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు.

ఆ విధంగా ఓ ముగ్గురు దర్శకులు.. ఓ వెటరన్ - ఓ జూనియర్ ఓ ఫ్రెండ్.. అలా కామెంట్ చేశారు.