Begin typing your search above and press return to search.
డిస్ట్రిబ్యూటర్లకి మద్దతుగా దాసరి?
By: Tupaki Desk | 18 April 2016 4:21 AM GMTదర్శకుడు పూరి జగన్నాథ్ కీ... డిస్ట్రిబ్యూటర్లకీ మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదం కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లకి మద్దతుగా నిలిచేందుకు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ముందుకొచ్చారు. మరి కొద్దిసేపట్లో ఆ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఫిల్మ్ ఛాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించబోతున్నాడు. అక్కడ ఆయన ఏం మాట్లాడతారు? ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.
లోఫర్ విషయంలో వచ్చిన నష్టాల్ని పూడ్చాలని డిస్ట్రిబ్యూటర్లు ఆ చిత్ర నిర్మాతని కోరారట. ఆ బాధ్యతని తన భుజాన వేసుకొన్న పూరి రోజులు గడుస్తున్నా ఎటూ తేల్చకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు గొడవకి దిగారు. ఆ గొడవ పోలీసు స్టేషన్లలో కేసుల వరకు వెళ్లింది. అయినా సరే... డిస్ట్రిబ్యూటర్లు మాత్రం శాంతించడం లేదు. మాకు న్యాయం జరగాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. దీనిపై సినీ పరిశ్రమకి పెద్దన్నలాంటి దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్లారు. ఆయన వాళ్ల వాదనని విని మద్దతుగా నిలిచేందుకు ముందుకొస్తున్నారని తెలుస్తోంది. పూరి నష్టపరిహారం చెల్లించకుండా ఆయన చేయబోయే కొత్త సినిమాల్ని అడ్డుకుంటామని డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెబుతున్నారు. మరి దాసరి కూడా ఈ రోజు విలేకర్ల సమావేశంలో అదే మాట అంటారా? లేక ఇద్దరికీ మధ్య రాజీ కుదిర్చేలా మాట్లాడతారా? అన్నది చూడాలి. పూరికీ - దాసరి నారాయణరావుకీ మధ్య సరైన ఈక్వేషన్స్ లేవన్న ప్రచారం కూడా సాగుతోంది. అందుకే ఆయన డిస్ట్రిబ్యూటర్లకి మద్దతుగా వస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో చూడాలి.