Begin typing your search above and press return to search.
సెలవు రోజున దాసరి కోసం సెలవా?
By: Tupaki Desk | 9 Jun 2017 5:39 AM GMTమన ఫిలిం ఇండస్ర్టీలో ఈ మధ్యన తెరపై తీసే కామెడీల కంటే కూడా.. తెర వెనుక చేసే కామెడీలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మనోళ్ళు రియల్ గా మనస్ఫూర్తిగా చేయాల్సిన పనిని కూడా.. ఏదో నామ్ కే వాస్తే చేస్తున్నట్లు చూస్తుంటే.. దానిని కామెడీ కాక ఇంకేమంటాం. అదిగో ఇప్పుడు లెజండరీ డైరక్టర్ దాసరి నారాయణరావు గారి సంతాప సభను ఏర్పాటు చేయడానికి.. చివరకు ఒక తేదీ ఫిక్స్ చేసి.. ఆరోజు ఇండస్ర్టీ మొత్తానికి సెలవ అంటూ పెద్ద కామెడీ చేసేశారు.
ఈ ఆదివారం నాడు దాసరి వారి 11వ రోజు సందర్భంగా ఆయన వర్ధంతిని నిర్వహిస్తున్నారట. అలాగే సంతాప సభ ఏర్పాటు చేసి.. దానికి ఇండస్ర్టీ పెద్దలందరినీ పిలుస్తున్నారట. పైగా ఆరోజు షూటింగులు చేయకూడదు.. ఎటువంటి పనీ కూడా చేయకూడదని అని అనుకుని సెలవు తీసుకుంటున్నారట. అసలు ఆదివారం ఇండస్ర్టీ దాదాపు 80% సెలవే. మళ్ళీ వీళ్లు ప్రత్యేకంగా దాసరి కోసం సెలవ అనడం ఏంటో ఎవ్వరికీ అర్దం కావట్లేదు. మద్రాస్ నుండి హైదరాబాదుకు ఇండస్ర్టీ రావడానికి అక్కినేనితో పాటు ముఖ్య కారకులైన దాసరికి.. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంచనాలతో అంత్యక్రియలు చేయించింది కాని.. సినిమా ఇండస్ర్టీ మాత్రం ఎందుకో ఓ రెండు సెలవదినాలు కూడా ప్రకటించలేకపోతోంది.
ఇకపోతే అసలు సంతాప సభ ఏర్పాటు చేయడానికి ఇన్నేసి రోజులు ఎందుకు జాప్యం జరిగిందంటే.. చాలామంది పెద్దలు ఊళ్ళో లేకపోవడం వలనేనట. ఆ కారణం ఏదో నమ్మశక్యంగానే చెప్పారుగాని.. మరీ దారుణంగా సెలవు రోజున సంతాప సభ పెట్టేసి.. సెలవిచ్చాం అనడం ఏంటి గురూ?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/