Begin typing your search above and press return to search.

దాసరి గారి లోటు ఫీలవుతున్న తెలుగు సినిమా!

By:  Tupaki Desk   |   1 Jun 2020 11:30 AM GMT
దాసరి గారి లోటు ఫీలవుతున్న తెలుగు సినిమా!
X
సినీ పరిశ్రమలో సమస్యలు వస్తే ఎవరు పరిష్కరించాలి? నిజానికి ఫిలిం ఛాంబర్.. లేదా మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్).. లేదా ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ లాంటివి ఇలాంటి విషయాలలో చొరవ చూపించాలి. ఈ సంఘాలు కొన్ని సమస్యలను పరిష్కరించగలుగుతున్నాయి కానీ చాలా ఎక్కువసార్లు ఇబ్బందులు తప్పడం లేదు. మా లో లుకలుకల సంగతి అందరికీ తెలిసిందే. ఇక మిగతా చోట్ల కూడా గ్రూపిజం ఉందని.. స్టార్ హీరోలు వీటివైపు కన్నెత్తి కూడా చూడరని ఆరోపణలు ఉన్నాయి.

అందుకే ఈమధ్య సినీ పరిశ్రమలో ఎలాంటి వివాదం తలెత్తినా అది రచ్చ రచ్చ అవుతోంది. గతంలో ఏదైనా ఒక సమస్య తలెత్తినప్పుడు స్వర్గీయ దాసరి నారాయణరావు చొరవ చూపించి పరిష్కరించేవారు. అది చిన్న కళాకారులు.. టెక్నిషియన్ల సమస్య అయినా.. లేకపోతే స్టార్ హీరోలు నిర్మాతల వ్యవహారమయినా ఆయన ఏదో ఒక రకంగా దాన్ని సామరస్యంగా పరిష్కరించి మీడియాలో కంపు కాకుండా అడ్డుకునేవారు. ఆయన లేని లోటు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోందని.. చిరంజీవి- బాలయ్య ఎపిసోడ్ ను గమనిస్తున్నవారు అంటున్నారు.

ఒక వివాదం నెలకొన్న సమయంలో తప్పొప్పులు ఎవరివి అనేవి ఊరికే లాజిక్కులు తీసుకుంటూ లాక్కుంటూ పోతే ఆ సమస్య ఎన్నటికీ తీరదు. పెద్దమనుషులు అన్నవారు ఇరు పక్షాలకు సర్ది చెప్పి ఆ సమస్య మరింత పెద్దది కాకుండా చూడాలి. చిరు - బాలయ్య ఎపిసోడ్ లో బాలయ్య మాట తీరుపై చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి కానీ ఆయనను పిలవలేదన్న విషయం.. మా ను పక్కన పెట్టి చిరంజీవి టీమ్ తెలంగాణా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిందన్న విషయం ఎలా సర్దిచెప్పుకోగలరని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. ఇక నాగబాబు ఎంట్రీ తర్వాత వివాదం తారాస్థాయికి చేరింది.

ఇలా పబ్లిక్ గా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతే ఇండస్ట్రీ పరువే బజారున పడుతుంది. ఎవరైనా ఈ విషయం గుర్తించాల్సిందే. మరో వైపు ఇండస్ట్రీకి మేము పెద్దలం అని చెప్పుకోవడానికి అదేదో హోదా లాగా పెద్దరికం తీసుకోకూడదని.. సమస్యలు సాల్వ్ చెయ్యడానికి.. తీసుకోవాలని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. దాసరి గారికి ఇప్పుడున్న పెద్దలకు తేడా అదేనని అంటున్నారు. అప్పట్లో ఇలాంటి సమస్యలను ఆయన ఎంతో సులువుగా పరిష్కరించేవారని.. అందరితో మాట్లాడేవారని అంటున్నారు. అయన లేకపోవడం లోటేనని అంటున్నారు.