Begin typing your search above and press return to search.
డ్యాషింగ్ డైరెక్టర్ బర్త్ డేకి ఫ్యాన్స్ డబులు ట్రీట్!
By: Tupaki Desk | 26 Sep 2021 1:30 AM GMTరౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ముంబై..హైదరాబాద్ లో చేసారు. ఇటీవలే టీమ్ గోవాకి షిప్ట్ అయింది. గోవా అందాల నడుమ కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అవసరం మేర అక్కడా సెట్లు నిర్మించి షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఓ స్టేడియం సెట్ నిర్మించి అందులోనే షూటింగ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30తో గోవా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అనంతరం తదుపరి షెడ్యూల్ కోసం విదేశాలం పయనం కానున్నారు. ప్రస్తుతం పూరి కనెక్స్ట్ టీమ్ వీసా పనుల్లో బిజీ అయింది.
ఆ పనులు పూర్తికాగానే అక్టోబర్లో యూనిట్ ప్లైట్ ఎక్కనుంది. అయితే అంతకు ముందే `లైగర్` టీమ్ అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోందని సమాచారం. సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ రోజున చిత్ర టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని యూనిట్ రేపోమాపో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. వాస్తవానికి టీజర్ ని విజయ్ పుట్టిన రోజు సందర్భంగా మే9 న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పుడు కరోనా సెకెండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చి ప్రజల ప్రానాల్ని కబళించేస్తుండటంతో..ఇది సరైన సమయం కాదని భావించి యూనిట్ టీజర్ రిలీజ్ ని వాయిదా వేసుకుంది.
అప్పటి నుంచి పూరి-విజయ్ ఫ్యాన్స్ టీజర్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. తాజా సందర్భాన్ని బట్టి ఆ సమయం అసన్నమైనట్లే కనిపిస్తోంది. సెప్టెంబర్ 28న బిగ్ ట్రీట్ దాదాపు షురూ అయినట్లే. అలాగే ఈసారి పూరి బర్త్ డేని యూనిట్ స్పెషల్ గా గోవా బీచ్ లో ప్లాన్ చేసినట్లు ఉప్పందింది. చిత్ర నిర్మాతలలో ఒకరైన చార్మి ఈసారి పూరి పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని భావించి ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మరో నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే.