Begin typing your search above and press return to search.

డాషింగ్ పటానీ.. మ‌ళ్లీ మైండ్ బ్లాంక్!

By:  Tupaki Desk   |   8 Dec 2022 6:42 AM GMT
డాషింగ్ పటానీ.. మ‌ళ్లీ మైండ్ బ్లాంక్!
X
ఒకే ఒక్క లుక్కుతో అణు విస్పోట‌నంలా విరుచుకుప‌డ‌డం ఎలానో చూపిస్తోంది దిశా ప‌టానీ. ఇంత‌కుముందు సీకే బ్రాండ్ తో ఇన్ స్టా అభిమానుల‌కు సినిమా చూపించింది. ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ అంత‌ర్జాతీయ స‌మాజం నుంచి భార‌త‌దేశంలోని గల్లీ గ‌ల్లీకి విస్త‌రించిందంటే అది దిశా ప‌టానీ పుణ్య‌మే. అంత‌గా ఈ అమ్మ‌డి ప్ర‌చారం క‌లిసొస్తోంది. అయితే ఇదే అద‌నుగా ఇన్ స్టా ఆసరాగా ల‌క్ష‌ల్లో ఆర్జిస్తూ దిశా టాప్ గేమ్ ప్లేయ‌ర్ గా మారింది. భారీ సినిమాల‌తో పారితోషికాల‌కు ఇది అద‌న‌పు సంపాద‌న‌.

ఇప్ప‌టికే దిశా ప‌టానీ బికినీలు స్విమ్ సూట్ ల‌తో క‌ళ్లు చెదిరే విన్యాసాలు ఇన్ స్టా వేదిక‌గా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. వీటికి మించి దిశా మార్ష‌ల్ ఆర్ట్స్ స్కిల్స్ షేక్ చేస్తున్నాయి. తన అభిమానుల‌ను ఎలా కట్టిపడేసి వినోదాన్ని పంచాలో బాగా తెలిసిన టాప్ మోడ‌ల్ కం నటిగా దిశా పటానీ వెలిగిపోతోంది. ర‌క‌ర‌కాల ఎగ్జోటిక్ హాలిడే స్పాట్ ల నుండి బికినీ ఫోటోల‌తో తరచుగా అల‌రిస్తూనే ఉంది.

మ‌రోవైపు కెరీర్ ప‌రంగాను దిశాకు క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్లు ఉన్నాయి. తదుప‌రి కరణ్ జోహార్ నిర్మిస్తున్న‌ యాక్షన్-థ్రిల్లర్ చిత్రం యోధాలో సిద్ధార్థ్ మల్హోత్రా స‌ర‌స‌న‌ స్క్రీన్ స్పేస్ ను పంచుకుంటోంది.ఈ చిత్రం 7 జులై 2023న భారీగా థియేట‌ర్ల‌లోకి రానుంది.

దిశా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన బీచ్ వెకేషన్ నుండి ఫోటోను షేర్ చేసింది. త‌ను ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇవ్వలేదు. కానీ ఈ ఫోటో చాలా విష‌యాల‌ను అభిమానుల‌కు చెబుతోంది. స్నాప్ లో నెక్ లైన్ - బ్లూ షార్ట్ లతో సెక్సీ పర్పుల్ టాప్ తో హాట్ గా క‌నిపిస్తోంది. బీచ్ లో చెప్పులు లేకుండానే అలా ఎండ‌లో నిల‌బ‌డి ట్యాన్ ని పొందుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో విస్పోట‌నంలా మారింది. వినోద ప్రియుల‌కు ఇది చూడటానికి ఎంత సింపుల్ గా ఉందో అంత‌కుమించి హీటెక్కిస్తోంది.

ఇంత‌కుముందు తన కుడి కాలుకు కట్టు వేసి కనిపించినప్పుడు హెడ్ లైన్స్ లో నిలిచింది. తన కాలికి గాయమైందని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయినా త‌న ప‌నిని ఆప‌లేదు. ఆదివారం నాడు త‌న తీరిక స‌మ‌యాన్ని ఇలా రిలాక్స్ మోడ్ లో క‌నిపించింది. దిశా తన సన్నిహితులతో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్లింది. కెమెరామెన్లు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో దిశా ముంబైలోని ఓ పాపుల‌ర్ రెస్టారెంట్ వెలుపల కనిపించింది. నటి కుడి కాలు కట్టుతో క‌నిపించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... మోహిత్ సూరి క్రైమ్-థ్రిల్లర్ 'ఏక్ విలన్ 2'లో జాన్ అబ్రహం సరసన దిశా పటాని కనిపించింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్- ప్రభాస్ మరియు దీపికా పదుకొణెలతో కలిసి ప్రాజెక్ట్ కెలో న‌టిస్తోంది. సూర్య 42- యోధా చిత్రాల్లోను న‌టిస్తోంది. యోధా కొత్త సంవ‌త్స‌రం లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.