Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో బాబి మూవీ లాంచ్ కి డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   22 Oct 2021 6:33 AM GMT
మెగాస్టార్ తో బాబి మూవీ లాంచ్ కి డేట్ ఫిక్స్
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి వాల్టేర్ శీను అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. చిరంజీవి 154వ చిత్రంగా దీన్ని సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ ప్రీ లుక్ పోస్ట‌ర్ ఓ రేంజ్ లో సినిమాపై హైప్ తీసుకొచ్చింది.. మెగాస్టార్ ని మ‌త్స‌కారుడిగా ఊర మాస్ లుక్ లో చూపించడంతో మాస్ ఫ్యాన్స్ లో అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. అంత‌కు ముందే బాబి చిరు ని ఓ అభిమానిగా డైరెక్ట్ చేస్తున్న‌ట్లు.... ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైనర్ అని రివీల్ చేయ‌డంతో మ‌ళ్లీ ఒక‌ప్ప‌టి మెగాస్టార్ ని వెండి తెర‌పై చూడ‌బోతున్నాం అన్న భావ‌న నెల‌కొంది. దీంతో ఏ సినిమా ఎప్పుడు ప్రారంభమ‌వుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మెగాస్టార్ ని వెండి తెర‌పై ఎప్పుడు చూస్తాం? అంటూ ఒక‌టే ఎగ్జ‌యిట్ మెంట్ మెగాభిమానుల్లో క‌నిపిస్తోంది.

తాజాగా ఈ సినిమా లాంచింగ్ ముహూర్తం ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్ 6న గ్రాండ్ గా ప్రారంభోత్స‌వం జ‌రుగ‌నుంది. ఆ రోజున సినిమాకి సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలిసే అవ‌కాశం ఉంది. మెగాస్టార్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రు? మాస్ క‌థాంశంలో చిరును ధీటుగా ఢీకొట్టే ప్ర‌తి నాయ‌కుడు ఎవ‌రు? వంటి వివ‌రాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.

చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో `ఆచార్య‌`లో న‌టిస్తోన్న‌సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. సంక్రాంతి కానుగా రిలీజ్ చేయ‌డానికి ముహూర్తం పెట్టారు. అలాగే మ‌రోవైపు చిరంజీవి `గాడ్ ఫాద‌ర్` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మల‌యాళంలో విజ‌యం సాధించిన `లూసీఫ‌ర్` కి రీమేక్ గా తెర‌కెక్కుతోంది. మ‌రోవైపు చిరు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర‌` లోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

చిరు ఇక క‌థ‌లు విన‌డం లేదట నిజ‌మేనా?

ఇటీవ‌ల మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ ద‌ర్శ‌కుల్ని ఫైన‌ల్ చేస్తూ బౌండ్ స్క్రిప్టుల్ని రెడీ చేయిస్తూ ఇప్ప‌టికే నాలుగు సినిమాల‌కు క‌మిటైన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ స‌మ‌యంలో క‌థ‌ల్ని వండించి ఫైన‌ల్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆయ‌న షెడ్యూల్ చూస్తుంటే మ‌రో నాలుగైదేళ్లు క్ష‌ణం అయినా తీరిక లేకుండా సెట్స్ కి ప‌రుగులు పెట్టాల్సి ఉంటుంది. కానీ చిరు ఏజ్ 60 బార్డ‌ర్ ని క్రాస్ చేసింది. ఈ ఏజ్ ని కూడా ఖాత‌రు చేయకుండా ఆయ‌న సినిమాలు చేస్తున్నారు. రిస్కీ స్టంట్స్ .. డ్యాన్సుల‌తో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. నేటిత‌రం హీరోలు సైతం అసూయ ప‌డేంత ఎన‌ర్జీతో క‌నిపిస్తున్నారు. ఇక బాస్ లో గ్రేస్ ని చూసి అభిమానుల్లో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తోంది.

అయితే చిరు లైన‌ప్ చూసి ఒక సెక్ష‌న్ నుంచి సందేహాలు వ్య‌క్తం చేశారు కొంద‌రు. ఆయ‌న ఈ ఏజ్ లో అదే దూకుడు కొన‌సాగించ‌గ‌ల‌రా? అంటూ ఒక వ‌ర్గం జ‌నం ప్ర‌చారం చేస్తున్నారు. కానీ చిరు ఎన‌ర్జీ చూస్తుంటే ఇప్ప‌టికే అంగీక‌రించిన నాలుగు సినిమాలే కాకుండా మ‌రో ప‌దేళ్ల‌లో పాతిక వ‌ర‌కూ సినిమాలు సునాయాసంగా చేసేందుకు వీలుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. కొర‌టాల‌తో ఆచార్య‌ను పూర్తి చేసి సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేస్తున్నారు. త‌దుప‌రి లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి చేస్తున్నారు. త‌ర్వాత‌ వేదాళం రీమేక్ భోళా శంకర్ ని పూర్తి చేయబోతున్నారు. త‌ర్వాత కెఎస్ రవీంద్ర తో వాల్టేర్ శీను లైన్ లో ఉంటుంది. మరికొందరు దర్శకులు క‌థ‌లు వినిపించి చిరును లాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో మారుతి పేరు కూడా వినిపిస్తోంది. మ‌రో న‌లుగురు స్క్రిప్టుల్ని వండే ప‌నిలో ఉన్నార‌ని కూడా తెలిసింది. వీరంతా మెగాస్టార్ చిరంజీవి స్వంత బ్యాన‌ర్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలో కాకుండా.. బయటి బ్యానర్ లలో చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇక ఇత‌ర అగ్ర బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేస్తే చిరుకి భారీ పారితోషికాలు లాభాల్లో వాటాలు ముడుతుంటాయి. అయితే చిరు ఇప్పుడున్న సినిమాల షెడ్యూల్స్ ని వేగంగా పూర్తి చేస్తే కానీ త‌దుప‌రి చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి. గాడ్ ఫాద‌ర్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యి.. భోళా శంక‌ర్.. వాల్టేర్ శీను విష‌యంలో స‌గభాగం చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌యినా త‌దుప‌రి ఏ సినిమాలు చేయాలి? అన్న‌దానిపై గంద‌గోళం ఉండ‌ద‌ని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు చిరు తాపీగానే ఆలోచిస్తున్నార‌ట‌.