Begin typing your search above and press return to search.
వకీల్ సాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 23 April 2021 9:36 AM GMTపవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇటీవల మీడియాలో పుకార్లు షికార్లు చేసిన విషయం తెల్సిందే. సినిమా థియేటర్ లో విడుదల అయిన వారం రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిర్మాత దిల్ రాజు కొట్టి పారేశారు. వకీల్ సాబ్ ఓటీటీలో విడుదల చేసేందుకు చాలా సమయం ఉంది. ఇప్పట్లో రాదు కనుక థియేటర్ లోనే వకీల్ సాబ్ ను చూసి ఎంజాయ్ చేయండి అంటూ ఒక పోస్టర్ నే విడుదల చేయడం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. వకీల్ సాబ్ థియేటర్లు అన్ని కూడా బోసి పోయి కనిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమా ను ఓటీటీ లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు వకీల్ సాబ్ సినిమా ను స్ట్రీమింగ్ కోసం కొనుగోలు చేయడం జరిగిందట. మే 7వ తారీకున ఈ సినిమాను స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నారు. వకీల్ సాబ్ విడుదల అయిన నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ కు అమెజాన్ కు అనుమతి దక్కింది. థియేటర్లలో ఇంకా కూడా సినిమా ఆడుతున్న నేపథ్యంలో మరో రెండు వారాలు ఆగిన తర్వాత అమెజాన్ లో వకీల్ సాబ్ ను స్ట్రీమింగ్ చేయాలని బయ్యర్లు ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మే 7వ తారీకున లేదా అంతకు ముందే ఈ సినిమా స్ట్రీమింగ్ కు అమెజాన్ ప్లాన్ చేస్తోంది.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జత కలవడంతో ప్రేక్షకులు సినిమాను కమర్షియల్ గా సక్సెస్ చేశారు. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా కరోనా కారణంగా కనీసం పాతిక కోట్లను కోల్పోయినట్లుగా టాక్ వినిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వంటి కమర్షియల్ సక్సెస్ తో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అభిమానులు అంటున్నారు. థియేటర్లలో చూడలేక పోయిన పవన్ అభిమానులు మరియు ఫ్యామిలీ ప్రేక్షకులు వకీల్ సాబ్ ను ఓటీటీలో చూడటం కోసం ఎదురు చూస్తున్నారు. కనుక త్వరగా స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ఉవ్విల్లూరుతున్నట్లుగా తెలుస్తోంది.