Begin typing your search above and press return to search.
అమెజాన్ ను గైడ్ చేయనున్న మజిలీ
By: Tupaki Desk | 7 April 2019 5:30 AM GMTమొన్న ఏప్రిల్ 1వ తేది నుంచి అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్ సంస్థలకు శాటిలైట్ ఛానల్స్ కు 60 రోజుల తర్వాతే కొత్త సినిమాలను ప్రసారం చేసే విధంగా టాలీవుడ్ లో కీలక నిర్ణయం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పదే పదే సదరు లోగోలను హై లైట్ చేయడం ద్వారా జనంలో ఇది ఎలాగూ డిజిటల్ ప్లాట్ ఫారం మీద వస్తుంది కదా అప్పుడు ఫ్రీగా చూద్దామనే అభిప్రాయంలో ఉంటారని అది కూడా లేకుండా చేస్తారని వినిపించింది.
కాని మొన్న విడుదలైన మజిలి టైటిల్ కార్డ్స్ లో అమెజాన్ ప్రైమ్ లోగో ముందుగా ప్రత్యక్షం అయిపోయింది. అందులో వస్తుందా రాదా అనే విషయం గురించి ఇంకా బ్యానర్ పేరు పడకుండానే క్లారిటీ వచ్చేసింది. సో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత వస్తున్న మొదటి సినిమా మజిలి. ఈ లెక్కన డిజిటల్ స్ట్రీమింగ్ లో మజిలి జూన్ 4వ తేది నాడు చూసుకోవచ్చన్న మాట. అప్పటిదాకా ఇంత హైప్ హంగామా ఉండే ఛాన్స్ లేదు కాని థియేటర్ దాకా వెళ్ళని ప్రేక్షకులు ఉంటారు కాబట్టి వాళ్ళు దాని వైపు మళ్లుతారు
మొత్తానికి లోగో లేకుండా అయితే చేయలేకపోయారు. ఇప్పుడీ అరవై రోజుల ఫార్ములా ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి. అమెజాన్ సంస్థ సైతం గతంలో నెల లేదా 45 రోజుల గడువులో రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు 60 రోజులు వ్యవధిలో విడుదల చేసినప్పుడు వచ్చే వ్యూస్ ని పోల్చి దాన్ని బట్టి కొత్తగా హక్కుల ధరలు నిర్ణయించబోతున్నట్టు సమాచారం.
దాని సంగతి ఎలా ఉన్నా సినిమా ప్రారంభంలో అమెజాన్ లోగో డిస్ప్లే విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని నిర్మాతలకు ముందే చెబుతున్నట్టు సమాచారం. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో గడువు తప్ప మిగిలిన దేంట్లోనూ మార్పు ఉండదని తెలిసింది. ఒకవేళ 60 రోజుల తర్వాత కూడా అమెజాన్ కు రెస్పాన్స్ విషయంలో తేడా రాకపోతే మిగిలిన నిర్మాతలు రిలీఫ్ అవ్వొచ్చు. ఇప్పుడు మజిలికి వచ్చే ఆన్ లైన్ రెస్పాన్స్ ఫ్యూచర్ లో అమెజాన్ కు ఓ గైడ్ లా నిలవనుందన్న మాట