Begin typing your search above and press return to search.

'మహానాయకుడు'లో ఆ సీన్‌ నిజం కాదు : దగ్గుబాటి

By:  Tupaki Desk   |   4 March 2019 11:51 AM GMT
మహానాయకుడులో ఆ సీన్‌ నిజం కాదు : దగ్గుబాటి
X
'ఎన్టీఆర్‌' బయోపిక్‌ రెండు పార్ట్‌లు కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ అయితే దక్కించుకున్నాయి కాని కలెక్షన్స్‌ పరంగా మరీ దారుణమైన ఫలితాన్ని చవిచూశాయి. సినిమాలో ఎన్టీఆర్‌ గురించి మొత్తం పాజిటివ్‌ గా చూపించడం వల్లే సినిమాకు దెబ్బ పడింది అనేది కొందరి వాదన. 'ఎన్టీఆర్‌' చిత్రంపై చంద్రబాబు నాయుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందించారు. మొదటి పార్ట్‌ చాలా బాగుందని, అయితే కలెక్షన్స్‌ ఎందుకు రాలేదో అర్థం కాలేదని అన్నాడు. మహానాయకుడు సినిమాలో కొన్ని సీన్స్‌ నిజం కాదని దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్‌ గారు గుండె ఆపరేషన్‌ కోసం ఢిల్లీ వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కరరావు సీఎం పీఠం దక్కించుకోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను సినిమాలో నాటకీయంగా చూపించిన విషయం తెల్సిందే. ఎమ్మెల్యేలను రామకృష్ణ స్టూడియోలో ఉంచడం, వారిని బయటకు వెళ్లకుండా చూడటం వంటి సీన్స్‌ సినిమాలో చూపించారు. దాంతో పాటు రైలులో తెలుగు దేశం ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తున్న సమయంలో కొందరు ఎటాక్‌ చేసినట్లుగా కూడా చూపించారు. అవన్నీ నిజాలు కాదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నాడు.

ఢిల్లీకి ఎమ్మెల్యేలు వెళ్లే సమయంలో రైలులో నేను కూడా ఉన్నాను. ఎమ్మెల్యేలను ఎవరు ఎటాక్‌ చేయలేదు. ఎమ్మెల్యేలు అంతా కూడా స్వచ్చందంగా ఢిల్లీకి వచ్చారు. వారిని భయపెట్టి రామకృష్ణ స్టూడియోలో ఉంచడం జరగలేదు. రామకృష్ణ స్టూడియోలో ఎమ్మెల్యేలతో క్యాంప్‌ నిర్వహించే సమయంలో అంతా కూడా సినిమాలకు వెళ్లే వారు - ఇంకా నేను చెప్పకూడని కొన్ని ప్లేస్‌ లకు కూడా వెళ్లి వచ్చే వారు అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు. కొన్ని సీన్స్‌ విషయంలో తప్ప మొత్తం ఎన్టీఆర్‌ కథానాయకుడు మరియు మహానాయకుడు సినిమాల గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాజిటివ్‌ గా స్పందించడం జరిగింది.