Begin typing your search above and press return to search.

కూతురు ప్రేమ వ్యవహారం కన్ఫర్మ్‌ చేసిన స్టార్‌

By:  Tupaki Desk   |   17 July 2021 7:31 AM GMT
కూతురు ప్రేమ వ్యవహారం కన్ఫర్మ్‌ చేసిన స్టార్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ సునీల్‌ శెట్టి కూతురు అతియా శెట్టి గత కొన్నాళ్లుగా టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రేమ విషయమై మీడియాలో వస్తున్న వార్తలు ఇన్ని రోజులు పుకార్లు గా కొందరు భావించారు. కాని గత కొన్ని రోజులుగా కేఎల్‌ రాహుల్‌ తో అతియా శెట్టి ఇంగ్లాండ్‌ లో ఉంది.

ఇంగ్లాండ్ లో గత కొన్ని రోజులుగా వీరిద్దరు చెట్టా పట్టాలేసుకు తిరుగుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సోషల్‌ మీడియాలో కూడా వీరిద్దరు వారి ఫొటోలను మరియు వీడియోలను షేర్‌ చేస్తున్నారు. దాంతో ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారనే విషయం కన్ఫర్మ్‌ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో స్టార్‌ నటుడు సునీల్‌ శెట్టి స్పందించాడు.

మీడియాతో సునీల్‌ శెట్టి మాట్లాడుతూ ప్రస్తుతం అతియా శెట్టి ఇంగ్లాండ్‌ లో ఉంది. సోదరుడు అహాన్ శెట్టి కూడా ఆమెతో పాటు ఉన్నాడు. ఇద్దరు ఇంగ్లాండ్‌ లో హాలీడేస్ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇతర విషయాల గురించి ఇప్పుడు మాట్లాడను. ఆ విషయాలు మీకు తెలుసు అన్నట్లుగా సునీల్‌ శెట్టి సమాధానం ఇచ్చాడు.

ఆయన మాటలను బట్టి చూస్తే అతియా శెట్టి కుటుంబ సభ్యుల అనుమతితోనే కేఎల్‌ రాహుల్‌ తో ఇంగ్లాండ్‌ కు వెళ్లిందని.. ఇద్దరి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను ఒప్పుకున్నారనే టాక్ వినిపిస్తుంది. త్వరలోనే అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఖచ్చితంగా వీరిద్దరు ఒక ఇంటి వారు అవుతారనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్ గా పరిచయం అయిన అతియా శెట్టి మెల్ల మెల్లగా బాలీవుడ్‌ లో జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఈమె కేఎల్‌ రాహుల్‌ తో ప్రేమలో పడటం వల్ల కెరీర్‌ పరంగా కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్స్ కు క్రికెటర్స్‌ మద్య ప్రేమ వ్యవహారాలు కొత్తేం కాదు.

గతంలో పలువురు పెళ్లి చేసుకున్నారు... ప్రస్తుతం కొందరు ప్రేమలో ఉన్నారు. కొత్తగా వారి దారిలోనే కేఎల్‌ రాహుల్‌ మరియు అతియా శెట్టిలు జాయిన్ అయ్యారు. వీరి ప్రేమ వ్యవహారంకు కుటుంబ సభ్యులు అంగీకరించడం మంచి నిర్ణయం అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌ ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదికి పెళ్లి కొడుకు అవ్వడం ఖాయం అని ఆయన సన్నిహితులు మొదటి నుండి చెబుతూ వస్తున్నారు.

కేఎల్‌ రాహుల్‌ మరియు అహాన్‌ శెట్టిల ప్రేమ వ్యవహారం విషయంలో క్లారిటీ రావడంతో ఇకపై వారి పెళ్లి గురించి మీడియాలో పుకార్లు షికార్లు చేస్తాయని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. క్రికెటర్‌ గా మంచి ప్రతిభను కనబర్చుతూ ఉన్న కేఎల్‌ రాహుల్‌ పెళ్లికి ఒకటి రెండు ఏళ్లు వాయిదా వేసుకుంటే మంచిది అని.. టీమ్‌ లో మరింతగా ఆయన కుదురుకోవాలంటే క్రికెట్‌ పై ఎక్కువ శ్రద్ద పెట్టాలని.. అలా చేయడం వల్ల ఆయన టీమ్ ఇండియాలో టాప్ స్టార్‌ గా నిలుస్తాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.