Begin typing your search above and press return to search.

ఎర్ర కోకలో సూపర్‌ స్టార్‌ కూతురు

By:  Tupaki Desk   |   16 Feb 2022 10:33 AM GMT
ఎర్ర కోకలో సూపర్‌ స్టార్‌ కూతురు
X
సౌత్‌ లో స్టార్‌ హీరోల వారసులుగా వారి కొడుకులు మాత్రమే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఒక్కరు ఇద్దరు మినహా సౌత్‌ లో మొత్తం వారసులుగా కొడుకులు వచ్చారు. కాని కూతుర్లు మాత్రం పెద్దగా రాలేదు. కాని బాలీవుడ్‌ లో మాత్రం ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఎక్కువ శాతం మంది స్టార్ కిడ్స్ అనడంలో సందేహం లేదు. ఆలయా భట్ మొదలుకుని మొన్న వచ్చిన అనన్య పాండే వరకు ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్ కూతుర్లు తెరంగేట్రం చేశారు.

వారి దారిలోనే మరో బాలీవుడ్‌ సూపర్ స్టార్‌.. కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహాన ఖాన్ తెరంగేట్రంకు సిద్దం అయ్యింది. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా రెండు మూడు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వకుండానే షారుఖ్ ఖాన్‌ కూతురుగా సుహాన ఖాన్ కు మంచి గుర్తింపు దక్కింది.

సోషల్‌ మీడియాలో ఈమె తన హాట్‌ ఫోటోలు మరియు వీడియోలు.. రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్‌ చేస్తూ ఉండటం వల్ల ఏకంగా రెండున్నర మిలియన్‌ ల ఫాలోవర్స్ ను ఇన్‌ స్టా గ్రామ్‌ లో దక్కించుకుంది. తనకంటూ సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకునేందుకు ముందు నుండే ప్రయత్నాలు చేస్తోంది. షారుఖ్ ఖాన్‌ కూతురు గా బాలీవుడ్‌ లో అడుగు పెట్టినా కూడా తనకంటూ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని సుహాన ఖాన్‌ ప్రయత్నాలు చేస్తుంది.

తాజాగా ఈ స్టార్‌ కిడ్‌ సారి పిక్స్ ను షేర్ చేసి తన ఫాలోవర్స్ ను సర్‌ ప్రైజ్ చేసింది. రెగ్యులర్ గా స్కర్ట్‌ లు.. మిడ్డీలు.. మినీస్.. స్లీవ్ లెస్.. ఇలా మోడ్రస్ డ్రస్‌ ల్లో నిపించే సుహాన ఖాన్ అనూహ్యంగా చీర కట్టులో కనిపించడంతో అంతా కూడా అవాక్కయ్యారు. చీర కట్టులో ఎప్పుడు లేనంత అందంగా ఉన్నావు అంటూ ఆమె ఫాలోవర్స్ తెగ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

సుహాన ఖాన్ చీర కట్టులో.. అది కూడా ఎర్ర చీరను ఆమె కట్టుకోవడంతో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఇన్నాళ్లు మోడ్రన్‌ డ్రస్ ల్లో సింపుల్ గా చిన్న అమ్మాయిగా కనిపించిన సుహాన ఖాన్ ను ఒక్కసారిగా ఇలా చూడటం ఆశ్చర్యంగా ఉందంటూ వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంతకు మించిన సమయం ఏమీ లేదని.. వెంటనే మీరు హీరోయిన్ గా చేయాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హీరోయిన్‌ గా సుహాన ఖాన్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ సమయంలోనే షారుఖ్ తనయుడు ఆర్యన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలో ఆయన సినిమా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. కాని గత ఏడాది డ్రగ్స్ కేసు తో అరెస్ట్‌ అయ్యి జైల్లో పడటం వల్ల కాస్త ఆలస్యంగా ఆయన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు స్టార్‌ కిడ్స్ ఇండస్ట్రీని ఏలేస్తున్న సమయంలో ఈ స్టార్‌ కిడ్స్ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.