Begin typing your search above and press return to search.

మెగా మనవరాలికి పేరు పెట్టారోచ్

By:  Tupaki Desk   |   19 Jan 2019 4:28 AM GMT
మెగా మనవరాలికి పేరు పెట్టారోచ్
X
మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ ఈమధ్య ఒక పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ పాపకు పేరు పెట్టినట్టుగా శ్రీజ భర్త కళ్యాణ్ తాజాగా వెల్లడించాడు. తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "పాప పేరు #నవిష్క" అంటూ పేరు ను వెల్లడించాడు. నవిష్క అనే పదానికి అర్థం ఫరెవర్ న్యూ(ఎప్పుడూ కొత్తగా ఉండేది) అని తనే వెల్లడించాడు.

ఫోటోలో శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ఇద్దరూ చిరు నవ్వులు చిందిస్తున్నారు. ఊయలలో ఉన్న పాప మొహానికి కళ్యాణ్ దేవ్ తన చేతిని అడ్డంగా పెడితే.. శ్రీజ మాత్రం పాప పాదాలను అలా పట్టుకుంది. ఫోటోను పోస్ట్ చేసి పేరును చెప్పిన దగ్గరనుండి మెగా అభిమానులు శ్రీజ కళ్యాణ్ జంటను అభినందనలతో ముంచెత్తుతున్నారు. పేరు భలేగా ఉందని మెచ్చుకుంటున్నారు.

శ్రీజకు మొదటి వివాహం ద్వారా నివృతి అనే పాప ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో పాప పేరు కూడా 'న' అనే అక్షరంతోనే పెట్టడం విశేషం. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు అందరికంటే చిన్న బేబీ ఈ నివిష్క.