Begin typing your search above and press return to search.

ఫీల్డ్ లోనూ 'బుట్టబొమ్మ'ను వదలని వార్నర్.. ఫ్యాన్స్​ ఫిదా

By:  Tupaki Desk   |   28 Nov 2020 9:15 AM IST
ఫీల్డ్ లోనూ బుట్టబొమ్మను వదలని  వార్నర్.. ఫ్యాన్స్​ ఫిదా
X
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ కు అల వైకుంఠపురము సినిమాలోని 'బుట్ట బొమ్మ ' సాంగ్ అంటే అందరికీ తెలిసిందే. ఇండియా ఆస్ట్రేలియా భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా వార్నర్ మైదానంలోనే బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ వేసి ప్రేక్షకులను అలరించాడు. సుధీర్ఘ విరామం అనంతరం అభిమానులు స్టేడియానికి వెళ్లి మ్యాచ్​లు వీక్షించే అవకాశం దక్కింది. కరోనా లాక్​డౌన్​తో చాలా రోజులుగా క్రికెట్​ మ్యాచ్​లు జరగడం లేదు. ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్​ 2020 జరిగింది. కానీ అక్కడ అభిమానులను అనుమతించలేదు. దీంతో ఫ్యాన్స్​ అందరూ టీవీల్లోనే మ్యాచ్​ లు చూశారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న భారత్​​- ఆస్ట్రేలియా మ్యాచ్​లు చూసేందుకు అభిమానులను అనుమతించారు.

స్టేడియం లో 50 శాతం మాత్రమే టికెట్లు విక్రయించి.. సోషల్​ డిస్టెన్స్​తో మ్యాచ్​ను వీక్షించేందుకు అనుమతించారు. అయితే భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ 66 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్​ లో ఓ ఆసక్తికరమైన విషయం చోటుచేసుకున్నది. ఐపీఎల్​ 2020లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు కెప్టెన్​ గా వ్యవహరించిన వార్నర్​ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సోషల్​మీడియా లో ఎందరో ఆయనకు ఫ్యాన్స్​ గా మారారు. మరో వైపు వార్నర్​ కూడా తెలుగు పాటలకు డ్యాన్స్ ​లు చేస్తూ వీడియోలు రూపొందించారు. ఈ వీడియోలు ప్రేక్షకులను అలరించాయి.

‘బుట్టబొమ్మ’, ‘మైండ్​బ్లాక్’ లాంటి తెలుగు పాటలకు వార్నర్​ ఫ్యామిలీ డ్యాన్స్​ లు చేసింది. ఈ వీడియోలు తెగ వైరల్​ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా లో మ్యాచ్​ జరుగుతుండగా.. ‘వన్స్​మోర్​ వార్నర్​.. బుట్టబొమ్మ’ అంటూ అభిమానులు పెద్దగా అరుస్తూ కేరింతలు కొట్టారు. వార్నర్ కూడా వారిని ఉత్సహ పరచడానికి ఫీల్డ్ లోనే చిందేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​ అయ్యింది.