Begin typing your search above and press return to search.
సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ లో దావూద్ లింక్!
By: Tupaki Desk | 11 July 2020 6:00 AM GMTబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను దావూద్ గ్యాంగ్ హత్య చేసిందని `ఎన్.కె.సూద్ అనే మాజీ రా(RAW) అధికారి ఆరోపించడం తాజాగా ముంబై వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆయన ఓ వీడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనమైంది.
వీడియోలో సూద్ ఆరోపణ ఇలా ఉంది. దావూద్ ఇబ్రహీం ముఠా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను ఫోన్ లో బెదిరించిందని.. దీంతో సుశాంత్ తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యాడని ఆయన చెప్పారు. దావూద్ ముఠా మాత్రమే కాదు... సుశాంత్ సన్నిహితులు కూడా ఈ కుట్రలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.
సుశాంత్ ఆత్మహత్యకు ఒక రోజు ముందు సీసీటీవీ కెమెరాలు పని చేయకుండా నిలిచిపోయాయని ఎన్.కె.సూద్ వాదించారు. అంతేకాకుండా.. దావూద్ ముఠా నుండి వచ్చే బెదిరింపులకు భయపడి సుశాంత్ సింగ్ ఏకంగా 50 సిమ్ కార్డులను మార్చాడని.. తన కారులోనే నిద్రించేవాడని సూద్ అన్నారు.
ఇంతకీ ఎవరీ ఎన్.కె.సూద్? అన్నది ఆరా తీస్తే.. ఆయన రా ఏజెంట్. పైగా సుశాంత్ కి అభిమాన సేవకుడు. అతడు సుశాంత్ స్నేహితుడు సందీప్ సింగ్ సహా అనేక మంది బాలీవుడ్ పెద్దల వైపు వేలు చూపిస్తున్నాడు. వీరందరి భాగస్వామ్యంతోనే అతడు ఆకస్మికంగా మరణించాడని ఆరోపించారు.
జూన్ 14 న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అతను సూసైడ్ నోట్ ఏదీ వదిలిపెట్టలేదు. పైగా ఎంతో తీవ్ర నిరాశతోనే ఈ దురాగతానికి పాల్పడ్డాడని ఆత్మహత్యపై పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ధృవీకరించింది. ఇందుకు కారణం డాన్ దావూద్ బెదిరింపులు అలాగే అతడి స్నేహితుల పాత్ర ఉందనేది రా అధికారి ఆరోపణ. మరి ఈ కోణంలో కూడా ముంబై పోలీసులు విచారిస్తారా? అన్నది చూడాలి.