Begin typing your search above and press return to search.

హిట్ యూనివ‌ర్స్ లోకి డీసీపీ రామ‌చంద్ర‌!

By:  Tupaki Desk   |   23 Dec 2022 6:36 AM GMT
హిట్ యూనివ‌ర్స్ లోకి డీసీపీ రామ‌చంద్ర‌!
X
దక్షిణాదిలో ఇప్పుడు మ‌ల్టీవ‌ర్స్ కాన్సెప్ట్ ట్రెండ్ గా మారుతోంది. సినిమాటిక్ యూనివ‌ర్స్ నేప‌థ్య సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టే అవ‌కాశం వుండ‌టం.. ఈ త‌ర‌మా సినిమాలు ప్రేక్ష‌కులకు స‌రికొత్త అనుభూతిని క‌లిగిస్తుండ‌టంతో కొంత మంది ద‌ర్శ‌కులు మ‌ల్టీవ‌ర్స్ ని సృష్టిస్తూ సినిమాటిక్ యూనివ‌ర్స్ నేప‌థ్యంలో సినిమాల‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే 'విక్ర‌మ్‌' సినిమాతో మ‌ల్టీవ‌ర్స్ ని సృష్టించిన లోకేష్ క‌న‌గ‌రాజ్ త్వ‌ర‌లో విజ‌య్ మీరోగా తెర‌కెక్కిస్తున్న ప్రాజెక్ట్ ని కూడా ఇదే ఫార్ముల‌తో తెర‌పైకి తీసుకురాబోతున్నాడు.

ఇదే త‌ర‌హా ఫార్ములాతో తెలుగులోనూ మ‌రి కొన్ని సినిమాల‌కు క్రేజీ ద‌ర్శ‌కులు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఇదిలా వుంటే ఇదే ఫార్ములాతో ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను 'హిట్‌' మూవీ సిరీస్ ల‌ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ హీరోగా 'హిట్‌' మూవీని తెర‌కెక్కించిన శైలేష్ కొల‌ను దీనికి సీక్వెల్ గా 'హిట్ 2'ని అడివి శేష్ తో రూపొందించాడు. రీసెంట్ గా హీరో నాని నిర్మించిన ఈ మూవీ విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

దీనికి సీక్వెల్ గా త్వ‌ర‌లో 'హిట్ 3'ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. హిట్ సీరీస్ ల‌ని నిర్మించిన హీరో నాని ఈ ఫ్రాంచైజీలో భాగంగా తెర‌పైకి రానున్న 'హిట్ 3'లో రూత్ లెస్ పోలీస్ ఆఫీస‌ర్ గా నేచుర‌ల్ స్టార్ నాని క‌నిపించ‌బోతున్నాడు.

'హిట్ 2' ఎండిండ్ లో నాని పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ 'హిట్ 3' హీరో ఎవ‌రు? .. ఎలా వుంటుందో క్లారిటీ ఇచ్చేశారు. ఈ సీక్వెల్ కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి. ఇదిలా వుంటే హిట్ యూనివ‌ర్స్ లోకి డీసీపీ రామ‌చంద్ర ఎంట‌ర్ కాబోతున్నారని తెలిసింది.

హిట్ 3ని నేచుర‌ల్ స్టార్ నానితో చేయ‌బోతున్న శైలేష్ కొల‌ను.. హిట్ 4ని సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ తో చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే వెంక‌టేష్ కు శైలేష్ కొల‌ను క‌థ వినినించాడ‌ని, క్యారెక్ట‌ర్ కొత్త‌గా ప‌వ‌ర్ ఫుల్ గా వుండ‌టంలో వెంక‌టేష్ .. శైలేష్ కొల‌నుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో వున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌.

అన్నీ కుదిరితే ఇదే వెంక‌టేష్ న‌టించ‌నున్న 75వ ప్రాజెక్ట్ కానుంద‌ని తెలుస్తోంది. గ‌తంలో విక్ట‌రీ వెంక‌టేష్ 'ఘర్ష‌ణ‌' మూవీలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ డీసీపీ రామ‌చంద్ర‌గా న‌టించి అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి పోలీస్ క్యారెక్ట‌ర్ల‌పై ఆస‌క్తిగా వున్న వెంక‌టేస్ రీసెంట్ గా హిట్ 2ని ప్ర‌త్యేకంగా వీక్షించి శైలేష్ కొల‌నుతో సినిమాకు ఆస‌క్తిని వ్య‌క్తం చేసిన‌ట్టుగా తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.