Begin typing your search above and press return to search.

చనిపోయి మళ్ళీ బ్రతికా.. కాంగన రనౌత్

By:  Tupaki Desk   |   21 Jan 2023 9:34 AM GMT
చనిపోయి మళ్ళీ బ్రతికా.. కాంగన రనౌత్
X
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి కంగనా రనౌత్. సోలోగా స్టార్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రలో ఆమె కనిపించబోతుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా కాంగన రనౌత్ పూర్తి చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కీలక విషయాలను ఆమె బయట పెట్టింది.

షూటింగ్ సమయంలో జరిగిన ఘటన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ చేసే సమయంలో ఫస్ట్ షెడ్యూల్ లోనే తాను డెంగ్యూ బారిన పడినట్లు పేర్కొంది. ఆ సమయంలో చాలా కష్టాలు పడ్డానని, రక్త కణాలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపింది. నా మీద నాకే అనుమానం వచ్చింది. భగవంతుడు పరీక్షలు పెట్టినట్లుగా అనిపించింది. నా ఆరోగ్య సమస్యల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు.

ఎందుకంటే నన్ను ప్రేమించేవారు ఆందోళన చెందుతారు. అలాగే నన్ను ద్వేషించేవారు సంతోషిస్తారు. ఆ అవకాశం నేను వారికి ఇవ్వకూడదు. అలాగే నన్ను ప్రేమించే వారి ఆందోళనకి నేను కారణం కాకూడదు. ఈ కారణంగానే నా అనారోగ్య సమస్యను బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఉంది. మన మీద మనకు నమ్మకం ఉండి, మనం కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు.

ఆ పరీక్షలో మనం నెగ్గాల్సిందే. సాధించే వరకు వదిలిపెట్టకూడదు. నాకైతే మళ్లీ ఇది పునర్జన్మ లాంటిది. దానికి సాయం చేసిన నా టీం అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీ ప్రేమ ఆశీస్సులు ఉంటే కచ్చితంగా సంతోషంగా ఉంటాను అని కాంగన రనౌత్ తన ఇంస్టాగ్రామ్ లో సుదీర్ఘ పోస్ట్ రాసింది. ఈ పోస్టుపై కాంగన నీ అభిమానించేవారు ఆసక్తికరంగా కామెంట్ చేస్తున్నారు. కాంగన వేగంగా కోల్కొని మరింత స్ట్రాంగ్ గా అందర్నీ ఎంటర్టైన్ చేయాలని ఆశిస్తూ కామెంట్లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.