Begin typing your search above and press return to search.
డ్రగ్స్ డీల్స్ అన్నీ రియా కంటే మేనేజరే ఎక్కువ చేశాడు!
By: Tupaki Desk | 13 Sep 2020 12:30 PM GMTసుశాంత్ సింగ్ కేసులో రోజుకో మతలబు బయటపడుతోంది. తాజాగా రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ చక్రవర్తి మరికొన్ని విస్తుపోయే నిజాలు చెప్పాడు. ఎన్.సిబి రిపోర్టులో తన సోదరి కంటే సుశాంత్ సింగ్ ని మేనేజరే ఎక్కువగా ఉపయోగించకున్నాడని.. తాను పుచ్చుకునే డ్రగ్స్ కోసం సుశాంత్ నే డబ్బు చెల్లించారని చెప్పారు. సుశాంత్ తన సోదరి కోసం ఎలా ఔషధాల్ని సేకరించేవాడో కూడా ప్రస్తావించాడు.
షోయిక్ తో కంటే మేనేజర్ శామ్యూల్ మిరాండా వద్ద ఉన్న సుశాంత్ క్రెడిట్ కార్డునే ఎక్కువగా ఉపయోగించేవారట. తాజాగా ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. సుశాంత్ కోసం డ్రగ్స్ సేకరించడానికి డబ్బు చెల్లించలేదని లేదా డబ్బును పొందలేదని సోయిక్ చెప్పాడు.
అయితే గత ఇంటర్వ్యూలో రియా నుండి సుశాంత్ సింగ్ డ్రగ్స్ ఎలా తీసుకునేవాడో తెలుసుకున్నానని అతను రోజుకు 4-5 సార్లు గంజాయిని తీసుకుంటాడని చెప్పాడు. ఈ విషయాన్ని నా సోదరి నాకు చెప్పారు. దీని ఆధారంగా.. నేను ఐదు గ్రాముల మొగ్గ (క్యూరేటెడ్ గంజాయి) ను ఎరేంజ్ చేస్తానని ఆమెకు చెప్పాను… అప్పుడు నేను నా స్నేహితుడు అబ్దేల్ బాసిత్ పరిహార్ ను మొగ్గ సోర్స్ కోసం సంప్రదించాను. అతను ఉపయోగించినట్లు మొగ్గ రేట్లను రియా - శామ్యూల్ మిరండాతో పంచుకున్నాను. అప్పుడు సుశాంత్ హౌస్ మేనేజర్ మిరండా ఉన్నాడు అని తెలిపాడు.
ఇదిలావుండగా.. ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 27 ఎ కింద జ్యుడీషియల్ కస్టడీకి పంపిన రియా.. షోయిక్‌ల బెయిల్ పిటిషన్లను ప్రత్యేక ఎన్‌సిబి కోర్టు శుక్రవారం తిరస్కరించింది. శనివారం ఏజెన్సీ ముంబై .. గోవాలోని ఏడు ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. తరువాత ఈ కేసులో కరం జీత్ సింగ్ ఆనంద్ ... అంకుష్ అర్నెజా అనే డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. పెడ్లర్ల నుండి నిషేధిత పదార్థాలు డబ్బును నార్కోటిక్స్ ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది.