Begin typing your search above and press return to search.

కామ్రేడ్ కి 15 ని.లు ట్రిమ్మింగ్

By:  Tupaki Desk   |   28 July 2019 8:04 AM GMT
కామ్రేడ్ కి 15 ని.లు ట్రిమ్మింగ్
X
విజ‌య్ దేవ‌ర‌కొండ - ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించిన `డియ‌ర్ కామ్రేడ్` ఈ శుక్ర‌వారం రిలీజైన సంగ‌తి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. ఈ సినిమా రౌడీ ఫ్యాన్స్ కి న‌చ్చినా కామ‌న్ ఆడియెన్ నుంచి డివైడ్ టాక్ వినిపించింది. ద్వితీయార్థం నెమ్మ‌దిగా సాగ‌డంపై వేదిక‌ల‌పైనే దేవ‌ర‌కొండ దీనిపై చ‌ర్చించారు. బాబీ-లిల్లీ ల‌వ్ స్టోరి ఆద్యంతం యువ‌త‌రానికి న‌చ్చినా సెకండాఫ్ లో ఒక ఊహించ‌ని మ‌లుపు త‌ర్వాత‌ ఎమోష‌న‌ల్ ట‌ర్న్ వ‌ల్ల‌నే స్లో అయ్యింద‌ని దేవ‌ర‌కొండ అన్నారు. కార‌ణం ఏదైనా కామ్రేడ్ కి నిడివి త‌గ్గించి చిన్న‌పాటి క‌రెక్ష‌న్ చేశార‌ని తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి ల్యాగ్ త‌గ్గించారట‌. నెమ్మ‌దిగా సాగే చోట 15 నిమిషాల ఫుటేజ్ ని ట్రిమ్ చేశార‌ని... అలాగే హుషారెత్తించే క్యాంటీన్ సాంగ్ ని అద‌నంగా జోడించార‌ని న‌టుడు సుహాష్ వివ‌రాల్ని తెలిపారు. ప్రేక్ష‌కుల అభ్య‌ర్థ‌న మేరకే ఈ మార్పులు చేశార‌ని అత‌డు అన్నారు. ఏం చేసినా రౌడీ ఫ్యాన్స్ ని మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకే ఈ ప్ర‌య‌త్నం. తొలిరోజు 10 కోట్ల వ‌సూళ్లు సాధించింద‌ని రిపోర్ట్ అందింది. శ‌ని- ఆదివారాల క‌లెక్షన్స్ విష‌యంలోనూ డోఖా లేద‌ని తెలుస్తోంది. తొలి వీకెండ్ ముగిశాక సోమ‌వారం నుంచి స‌న్నివేశం ఎలా ఉండ‌నుంది అన్న‌ది చూడాలి. కామ్రేడ్ చిత్రానికి 30 కోట్లు పైగా బిజినెస్ సాగింది. ఆ మేర‌కు షేర్ వ‌సూలైతే సేఫ్ అయిన‌ట్టేన‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.

ఈ సినిమా త‌ర్వాత దేవ‌ర‌కొండ న‌టిస్తున్న `హీరో` చిత్రాన్ని మైత్రి సంస్థ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. నాలుగైదు భాష‌ల్లో ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ చిత్ర‌మిది. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ ని చేశారు. తదుప‌రి కొత్త షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని తెలుస్తోంది.