Begin typing your search above and press return to search.
కామ్రేడ్ విప్లవ గీతం.. ఎవరు బెస్ట్?
By: Tupaki Desk | 19 July 2019 7:44 AM GMTఅసలే స్టూడెంట్... ఆపై కామ్రేడ్.. లవ్ లోనూ రెబల్! ఇంకేం ఉంది.. ఆ క్యారెక్టరే ఇంట్రెస్టింగ్. కాలేజ్ లో విప్లవకారుడు అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. స్టూడెంట్ ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) యాక్టివిటీస్ పీక్స్ లో ఉంటాయి. పైగా కామ్రేడ్ తన ప్రేమను గెలుచుకునేందుకు ఉద్యమించబోతున్నాడు. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీకి ఆంథెమ్ (గీతం) ఒకటి రెడీ చేయాలంటే అంత సులువేమీ కాదు. పైగా నాలుగు భాషల్లో నాలుగు రాష్ట్రాల జనాలకు నచ్చేలా దానిని రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం `డియర్ కామ్రేడ్` చిత్రానికి కామ్రేడ్ గీతం చాలా ఇంపార్టెంట్ అని గ్రహించిన దేవరకొండ దానిపై ప్రయోగాలు చేయడం హాట్ టాపిక్.
స్టోని సైకో- డోప్ డాడీ లాంటి ట్యాలెంటెడ్ గాయకులతో కలిసి తెలుగు వెర్షన్ కి విజయ్ నే పాడేశారు ఈ విప్లవ గీతం. మలయాళంలో దుల్కార్ సల్మాన్ .. తమిళంలో విజయ్ సేతుపతి గొంతు కలిపారు. ఒక్కో భాషలో ఒక్కో హీరోతో పాడిస్తూ దేవరకొండ పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కామ్రేడ్ ఆంథెమ్ తెలుగు -తమిళం- మలయాళం లో ఇప్పటికే రిలీజైంది. ఈ గీతాలు ప్రస్తుతం ఫ్యాన్స్ లోకి జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి. నాలుగు భాషల్లో ఈ ఆంథెమ్ కి జస్టిన్ ప్రభాకరన్ అంతే జస్టిఫై చేసే ట్యూన్ అందించారు. ఈ ట్యూన్ `యువ` సినిమాలో జనగనమన అంత ఇంప్రెస్సివ్ గా సాగిందనే చెప్పాలి.
తెలుగు ప్రజలారా .. మౌనమిక చాలు పద! అంటూ సాగే గీతాన్ని విజయ్ అద్భుతంగా ఆలపించారు. ఇదే పాటకు దుల్కార్ .. సేతుపతి స్థానిక భాషల్లో ఇచ్చిన టోన్ ఆకట్టుకుంది. ఆ ముగ్గురిలో ఎవరు బెస్ట్? అన్నది మీరే చెప్పాలి. ఇకపోతే కన్నడ వెర్షన్ కి ఎవరు పాడారు? అన్నది చూడాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ యశ్ రంగినేనితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దేవరకొండ సరసన గీత గోవిందం ఫేం రష్మిక మందన నటించడం మూవీపై క్రేజును పెంచింది. ఇప్పటికే మెట్రోల్లో మ్యూజిక్ టూర్లు ప్రచారానికి కలిసొస్తున్నాయి. వీటికి విప్లవ గీతంతో ప్రచారం ప్రధాన ఆయుధం అనే చెప్పాలి. ఈనెల చివరిలో సినిమా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.