Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : డియర్ మేఘా
By: Tupaki Desk | 3 Sep 2021 1:51 PM GMT‘డియర్ మేఘా’ మూవీ రివ్యూ
నటీనటులు: మేఘా ఆకాష్-అదిత్ అరుణ్-అర్జున్ సోమయాజుల-పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: గౌర హరి
ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ
నిర్మాత: అర్జున్ దాస్యన్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుశాంత్ రెడ్డి
తెలుగులో మొన్నటిదాకా వరుసగా అపజయాలే పలకరించినా.. ఈ మధ్యే ‘రాజ రాజ చోర’తో తొలి విజయాన్ని దక్కించుకుంది తమిళ భామ మేఘా ఆకాష్. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటించిన మరో సినిమా ‘డియర్ మేఘా’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: మేఘా (మేఘా ఆకాష్) కాలేజీ రోజుల్లో తన సీనియర్ అయిన అర్జున్ (అర్జున్ సోమయాజుల) ప్రేమిస్తుంది. కానీ అతడికి తన ప్రేమను చెప్పే ధైర్యం ఆమెకు ఉండదు. కాలేజీ అయ్యాక మూడేళ్లు ఆమెకు దూరంగా ఉన్న అర్జున్.. తిరిగి ఆమెను కలుస్తాడు. అప్పుడే అతను కూడా మేఘాను ముందు నుంచే ప్రేమిస్తున్నాడని వెల్లడవుతుంది. ఇద్దరూ సంతోషంగా ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ఓ యాక్సిడెంట్లో ఇద్దరూ గాయపడతారు. బ్రెయిన్ డెడ్ అయిన అర్జున్ మామూలు మనిషి కావడం కావడం అసాధ్యమన్న ఉద్దేశంతో అతను చనిపోయాడని మేఘా తల్లిదండ్రులు అబద్ధం చెబుతారు. ఈ బాధలో ఆత్మహత్యకు సిద్ధమైన మేఘాకు అనుకోకుండా ఆది (అదిత్ అరుణ్) పరిచయం అవుతాడు. దీంతో ఆమె మళ్లీ మేఘా మామూలు మనిషవుతుంది. ఆమెను ఆది ప్రేమిస్తాడు. నెమ్మదిగా మేఘా.. కూడా ఆదిని ఇష్టపడుతుంది. కానీ ఇంతలో అర్జున్ కోలుకుని మేఘా దగ్గరికొస్తాడు. అప్పుడు మేఘా ఏం చేసింది.. ఎవరికి సొంతమైంది.. ఈ క్రమంలో ఎవరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: ఒక భాషలో మంచి విజయం సాధించినంత మాత్రాన అదే సినిమా మరో భాషలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఉన్నదున్నట్లుగా తీసినా కూడా ఏదో మిస్సయిన ఫీలింగ్ రావచ్చు. మాతృకలో ఉన్న సోల్ మిస్ కావడం అనేక సందర్భాల్లో జరిగింది. ముఖ్యంగా ప్రేమకథల విషయంలో ఒరిజినల్లోని మ్యాజిక్ అన్నిసార్లూ పునరావృతం కాదు. ఇందుకు గొప్ప ఉదాహరణ అంటే.. ‘వాన’ మూవీనే. కన్నడలో సంవత్సరం రోజులు ఆడిన ‘ముంగారుమలే’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మంచి మ్యూజిక్ తో మురిపించినప్పటికీ.. మాతృకలా ఇది మన ప్రేక్షకులను కదిలించలేకపోయింది. ఇప్పుడు ‘డియర్ మేఘా’ విషయంలోనూ దాదాపు ఇలాగే జరిగింది. ఇది కూడా ‘దియా’ అనే కన్నడ చిత్రానికి రీమేక్ కావడం గమనార్హం. మాతృకను దాదాపు అలాగే తీసినా.. అందులో ఉన్న ఫీల్ ఇక్కడ లేకపోయింది. కథలో విషయం ఉన్నప్పటికీ.. కథన లోపం ఈ సినిమాకు ప్రతికూలంగా మారింది. అసహజమైన కొన్ని ఎపిసోడ్లు.. పండని ప్రేమ సన్నివేశాలు.. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వేగంగా సాగని కథనం ఈ సినిమా ప్రభావాన్ని తగ్గించాయి.
ఒకప్పుడంటే ఒకరితో ప్రేమ.. ఒకరితోనే జీవితం.. ప్రేమించిన వ్యక్తి దూరం కాగానే అంతటితో జీవితం శూన్యం.. అన్నట్లుగా సాగేవి కథలు. కానీ మారుతున్న కాలానికి తగినట్లు సినిమా కథల్లోనూ మార్పు వచ్చింది. ఒక ప్రేమ విఫలమయ్యాక లేదా ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యాక.. మళ్లీ జీవితం ఉంటుందనే సందేశాన్ని చాటే కథలు చాలా వచ్చాయి. మరి ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకున్న ఓ అమ్మాయి.. కొన్ని రోజులకు వేరే అబ్బాయికి దగ్గరవుతున్న సమయంలో మొదట ప్రేమించిన అబ్బాయి తిరిగొస్తే ఎదురయ్యే సంఘర్షణ నేపథ్యంలో ‘డియర్ మేఘా’ కొంచెం సీరియస్ గా సాగే ముక్కోణపు ప్రేమకథ. ఈ కథలో మలుపులు బాగానే అనిపిస్తాయి. కానీ ఇద్దరు అబ్బాయిలతో ఆ అమ్మాయి ప్రేమకథలనే అనుకున్నంత ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయారు. మొదటి ప్రేమకథలో అయితే ఫీల్ పూర్తిగా మిస్సయింది. మాటల్లో ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ అని చెప్పించడమే తప్ప.. ఇద్దరి మధ్య ప్రేమ గాఢతను సూచించే సన్నివేశాలే పడలేదు. ప్రేమికులిద్దరూ కూడా తమ హావభావాలతో ప్రేమను వ్యక్తం చేయడంలోనూ విఫలమయ్యారు. ఈ కథ చాలా సాధారణంగా సాగిపోతున్న సమయంలో ట్విస్ట్ వచ్చి తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది.
ఆదిగా అదిత్ ప్రవేశంతో సినిమాలో కొంచెం ఊపు వస్తుంది. అతడి పాత్ర కొంచెం హుషారుగా ఉండటం వల్ల కథనంలో కదలిక కనిపిస్తుంది. ఐతే ఇక్కడ కూడా ప్రేమ సన్నివేశాలను మాత్రం సరిగా తీర్చిదిద్దలేదు. చాలా వరకు కృత్రిమంగానే అనిపిస్తుంది ఈ ఎపిసోడ్. దీని వల్ల రెండో ప్రేమ జంట విడిపోతున్నపుడు ఆ బాధను ప్రేక్షకులు ఫీలవ్వలేరు. పవిత్ర లోకేష్ చేసిన తల్లి పాత్రతో మరోసారి ట్విస్ట్ ఇచ్చి కథనంలో కొంత ఆసక్తిని తీసుకొచ్చారు. క్లైమాక్స్ కొంత హార్ట్ బ్రేకింగ్ గా అనిపిస్తుంది. కానీ అక్కడక్కడా వచ్చే ఈ మలుపుల్ని మినహాయిస్తే.. కథనంలో అంత వేగం లేదు. ప్రేమకథల్లో ఫీల్ మిస్సయింది. అందువల్ల రెండు గంటల నిడివే ఉన్నప్పటికీ ‘డియర్ మేఘా’ కొంచెం భారంగానే అనిపిస్తుంది. పాటలు.. విజువల్స్ ద్వారా కొంచెం ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది కానీ.. సన్నివేశాల్లో మాత్రం ఫీల్ మిస్సయింది. ఓవరాల్ గా ‘డియర్ మేఘా’ కథ పరంగా ఓకే అనిపించినా.. కథన లోపంతో ఇబ్బంది పెడుతుంది.
నటీనటులు: మేఘా ఆకాష్ చూడ్డానికి చాలా క్యూట్ గా అనిపిస్తుంది. నటన మాత్రం పాత్రకు అవసరమైన స్థాయిలో లేదు. హావభావాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. అదిత్ అరుణ్ నటన పరంగా అందరిలోకి ఎక్కువ మార్కులు వేయించుకున్నాడు. పాత్ర లోపం ఉన్నప్పటికీ అతను హుషారుగా నటించాడు. అతడి వాయిస్ కూడా బాగుంది. అర్జున్ సోమయాజుల ముఖంలో హావభావాలు సరిగా పలకలేదు. చాలా డల్లుగా కనిపించాడు. పవిత్ర లోకేష్ తన పాత్రకు న్యాయం చేసింది. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం: గౌర హరి పాటలు బాగానే సాగాయి. కథనానికి కొన్ని చోట్ల పాటలు బ్రేక్ వేసినా.. వినడానికైతే అవి బాగున్నాయి. సిద్ శ్రీరామ్ పాట అన్నింట్లోకి ఆకట్టుకుంటుంది. ఐ.ఆండ్రూ కెమెరా పనితనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టాడు నిర్మాత. దర్శకుడు సుశాంత్ రెడ్డి.. దాదాపుగా మాతృకను ఫాలో అయిపోయాడు. కానీ అందులో ఉన్న సహజంగా సన్నివేశాలను తీర్చిదిద్దలేకపోయాడు. ‘దియా’ కన్నడలో హిట్టయినప్పటికీ.. కథనం మరీ నెమ్మది అన్న విమర్శలు వచ్చాయి. ఆ లోపాన్ని తెలుగులో సరిదిద్దలేదు. పైగా మాతృకలో ఉన్న సోల్ కూడా మిస్సయింది.
చివరగా: డియర్ మేఘా.. డల్ లవ్ స్టోరీ
రేటింగ్ - 2.25/5