Begin typing your search above and press return to search.

డియర్ జిందగీ: ఆ పాయింట్ టచ్ చేసింది

By:  Tupaki Desk   |   26 Nov 2016 5:22 AM GMT
డియర్ జిందగీ: ఆ పాయింట్ టచ్ చేసింది
X
చాలా సినిమాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కొన్ని మనలో లోలోపల నిద్రపోతున్న హీరోయిజాన్ని తట్టిలేపుతాయి. కాని కొన్ని మాత్రం మనస్సుకు హత్తుకుంటాయి. క్రిటిక్స్ ఫ్లాప్ అని చెప్పినా.. మాస్ ఆడియన్స్ స్లో మూవీ అనేసినా.. ''డియర్ జిందగీ'' సినిమా మాత్రం కొందరి మనస్సులో చెరగని ముద్రను వేయడం ఖాయం.

''ఇంగ్లీష్‌ వింగ్లీష్‌'' సినిమాతో దర్శకురాలిగా అవతారం ఎత్తిన రైటర్ గౌరీ షిండే.. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా డియర్ జిందగీ సినిమాను చేసిందిలే. ఈ సినిమాలో ఒక డిప్రెసెడ్డ్ గాళ్‌ పాత్రలో ఆలియా భట్ నటించగా.. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చే సైకియాట్రిస్ట్ పాత్రలో షారూఖ్‌ ఖాన్ నటించాడు. ఈ సినిమాలో చూపించే మెయిన్ పాయింట్ ఏంటంటే.. ఒకవేళ చిన్నప్పుడు ఎవరైనా తమ తల్లిదండ్రులు దగ్గర ఏదన్నా విషయం చెప్పకుండా అలాగే పెరిగితే మాత్రం.. అది ఒక భయంగా మారిపోయి.. జీవితాంతం ఒక సైకిక్ డిప్రెషన్ తరహాలో వెంటాడుతూనే ఉంటుంది. చిన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ ను చూసి మనం నేర్చుకున్నవే.. మనం భయపడినవే.. మనతో వచ్చస్తుంటాయి. అలాంటి భయాలే మానసిక రుగ్మత తరహాలో మారిపోతుంది. ఈ విషయాలన్నీ ఆలియా భట్ ద్వారా.. షారూఖ్‌ ద్వారా.. బ్రహ్మాండంగా చెప్పింది గౌరీ షిండే.

నిజానికి 'డిప్రెషన్' అనే సమస్య కనిపించకుండా చాలా త్వరగా ప్రపంచాన్ని కమ్మేస్తున్న ఒక మహమ్మారి. అందుకే ఇలాంటి సినిమాలతో ప్రేరణ పొంది కనీసం కొంతమంది అయినా తమ జీవితాల్లో స్ర్టెస్ అండ్ డిప్రెషన్ వదిలేసి లైఫ్‌ ను సింపుల్ అండ్ స్వీట్ గా గడిపితే చాలు.