Begin typing your search above and press return to search.
బర్త్ రేట్ తో డెత్ రేట్ సమానంగా లేదు: పూరి జగన్నాధ్!
By: Tupaki Desk | 27 Dec 2022 1:30 PM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో యూ ట్యూబ్ లో స్పెషల్ డియోలు రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాను ఎంపిక చేసుకున్న అంశంపై తనదైన శైలిలో విశ్లేషిస్తూ...భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరో వీడియో తో ముందుకొచ్చేసారు. `మనిషి పుట్టి ఇప్పటికీ రెండు లక్షల సంవత్సరాలు అయింది. మానువజాతి పెరుగుతూ వచ్చి 8 బిలియన్లు దాటింది.
రోజూ 4 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. బర్త్ రేట్ తో డెత్ రేట్ సమానంగా లేదు. చావులు తక్కువ. పుట్టుకలు ఎక్కువైపోయాయి. మనుషుల వల్ల ప్రకృతి నాశనమైపోతుంది. అడవులన్ని మంట గలసిపోయాయి. మనం తిండి కోసం ఏటా 80 బిలియన్ జంతువులను చంపుతున్నాం( ఇందులో కోళ్లను మినహాయిస్తే). 1970 తర్వాత 60 శాతం జంతువులు అంతరించిపోయాయి.
మనం వేటిని బతకనీయడం లేదు. అన్ని అంతరించిపోతున్నాయి. దీనికి తోడు అందరం పిల్లల్ని పుట్టించడంలో బిజీగా ఉన్నాం. చాలా తప్పు ఇది. మానవ జాతి ఆగాల్సిన సమయం వచ్చింది. ఆగకపోతే మనం ఆపలేం. 1971 లో లెస్ యునైట్ అనే సామాజిక ఉద్యమకారుడు వాలంటరీ హ్యూమన్ ఎక్స్ టిన్షస్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ భూగ్రహాన్ని కాపాడాలంటే మానవ జాతి అంతరించిపోవాలి. అదొక్కటే సమాధానం. ఇదొక ఉద్యమం.
ఆ ఉద్యమంలో పాల్గొనాలంటే మనం ఆత్మహత్య చేసుకోవాల్సిన పనిలేదు. కనీసం పెళ్లిళ్లు చేసుకోవడం మానేయాలి. నా పిల్లలు..నా వంశం అనే ఆలోచన నుంచి బయట పడాలి. ఇలాంటి ఆలోచన రావాలంటే ఈ ప్లానెట్ ని ప్రేమించేంత పెద్ద మనసు ఉండాలి. మీరే వాలంటీర్ గా మీ వంశాన్ని ఆపాలి. మీ జాతిని ఆపాలి. మీది బ్లూ బ్లడ్ అయినా సరే..మీ పిల్లల్ని ఆపాలి. పిల్లల్ని కనడం ఆపకపోతే...కొన్నాళ్లకు ఈ భూగ్రహం మనుషులతో నిండిపోతుంది.
వేరే జంతువులు..పక్షులు..చెట్లు ఉండవు. ఈ మధ్య ఆడవాళ్లు తమ అండాల్ని భద్రపరుచుకోవడం మొదలు పెట్టారు. అసలు మీ అండాలు ఎందుకు దాచుకోవాలి. భవిష్యత్ లో పిల్లల కోసమా? భవిష్యత్ బాగోదు అనుకున్నప్పుడు అందులో మీ పిల్లలు ఎందుకు ఉండాలి? మీ సరదా కోసం పిల్లల్ని కని..పెంచి కొన్నాళ్లకు చనిపోతావు. కానీ అతి దారుణమైన వాతావరణంలో మీ డీఎన్ఏకు పుట్టిన మీ వారసుల్ని వదిలి వెళ్తున్నారని గుర్తు పెట్టుకోండి.
50 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి. గ్లోబల్ వార్మింగ్ పెరిగి..వాతావరణం వెడెక్కుతుంది. గ్లేసియర్స్ మాయమైపోతాయి. సముద్రాలు యాసిడ్ లా మారుతాయి. 70 శాతం హిమాలయాలు కరిగిపోతాయి. ప్రపంచ జనాభా మరో 10 బిలియన్లు పెరుగుతుంది. సహజ వనరులు ఉండవు. తినడానికి తిండి ఉండదు. సరిపడా ఆక్సిజన్ ఉండదు.
ఇవి కాకుండా జబ్బులు..కరోనాలు..అందులో రకరకాల వేరియంట్లు ఉన్నాయి. ఈ లెక్కన అప్పటికి ఎన్ని వైరస్ లు వస్తాయో ఊహించండి. అందుకే దయచేసి మీ అండాలు భద్రపరచకండి. ఉన్న పిల్లలు చాలు. అంతా స్వచ్ఛందంగా ఉద్యమంలో చేరి పునరుత్పత్తిని ఆపగల్గితే 200 ఏళ్ల వరకూ మానవ మునగడ కొనసాగుతుంది. అప్పుడు ఈ ప్లానెట్ పచ్చగా ఉంటుంది. వాలంటరీ హ్యూమన్ ఎక్సిటిన్షన్ అనేది అద్భుతమైన ఆలోచన` అని అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.