Begin typing your search above and press return to search.
సన్నీపై 19 ప్రాయంలోనే హత్యా బెదిరింపులు
By: Tupaki Desk | 24 Dec 2022 4:02 AM GMTసన్నీలియోన్ కెరీర్ లైఫ్ జర్నీ గురించి అభిమానులకు పరిచయం అవసరం లేదు. తన 19వ ఏట వయోజన(అడల్ట్) వినోద పరిశ్రమలో పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు శృంగార తారగా కొనసాగి తర్వాత భారతదేశానికి వచ్చి బాలీవుడ్ లో నటిగా ఐటమ్ గాళ్ గా కెరీర్ ని సాగించింది. అయితే తాను విదేశాల్లో అడల్ట్రీ పరిశ్రమలో నటిస్తున్నప్పుడు భారతదేశం నుండి ద్వేషపూరిత మెయిల్ లు వచ్చేవని... హత్యా బెదిరింపులు ఎదుర్కొన్నానని తన గతాన్ని ఇప్పుడు మరోసారి సన్నీలియోన్ గుర్తుచేసుకుంది.
19-20 ఏళ్ల వయసులో కెనడా (విదేశం) అడల్ట్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించినప్పుడు భారత్ నుంచి క్రూరమైన ట్రోలిం గ్ ను ఎదుర్కొన్నానని సన్నీ లియోన్ తెలిపింది. నిరంతరం తనని వేధిస్తూ ద్వేషపూరిత ఈ మెయిల్ లు వచ్చేవి. హత్యా బెదిరింపులు .. రకరకాల పిచ్చి ప్రేలాపనలను చవి చూశానని తెలిపింది.
బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించడానికి అడల్ట్ వినోద పరిశ్రమను విడిచిపెట్టాలని నిర్ణయించుకునే ముందు సన్నీలియోన్ పాపులర్ అడల్ట్ స్టార్ గా వెలిగిపోతోంది. తన పరిశ్రమ సహ నటుల నుండి తాను కోరుకున్న విధంగా జీవించేందుకు ఆమోదం పొందడానికి కొంత సమయం పట్టింది. బాలీవుడ్ తనని ఆహ్వానించినా కానీ ఆరంభం తనని శృంగారతారగానే చూశారు. వ్యంగ్యంగా క్రూరంగా చూడటం.. అవమానకరంగా మాట్లాడటం వగైరా పర్యవసానాలను ఎదుర్కొంది. ఎట్టకేలకు పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది.
సన్నీ కెనడా నుంచి అమెరికా వెళ్లింది. అమెరికాలోని అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ప్రారంభ కెరీర్ లో క్రూరమైన ట్రోలింగ్ ను ఎదుర్కొన్నానని కూడా గుర్తుచేసుకుంది. కాలక్రమంలో తాను ఎక్కడ నివసిస్తున్నా కానీ భారతదేశంలో తీవ్రమై ట్రోలింగ్ ను ఎదుర్కొన్నానని చెప్పింది. అడల్ట్ ఎంటర్ టైన్ మెంట్ స్టార్ గా తన కెరీర్ ను ప్రారంభించినప్పుడు ఆమె వయస్సు కేవలం 19-20 సంవత్సరాలు. భారత్ నుంచి తనకు విపరీతమైన వేధింపులు ఎదురయ్యేవి.
హత్యా బెదిరింపుల వల్ల తాను భారత్ కు ఎప్పటికీ రాలేనని అనుమానం వచ్చిందని సన్నీలియోన్ అన్నారు. భారతదేశంలోని ప్రజలు తనపై చాలా కోపంగా ఉన్నారని తన గురించి రకరకాల పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని చెప్పింది. తన గురించి చెడుగా మాట్లాడే ట్రోలర్లపై తన మొదటి ఎన్ కౌంటర్ ను గుర్తుచేసుకుంటూ తాజా మీడియా ఇంటరాక్షన్ లో తన ఆవేదనను సన్నీలియోన్ వ్యక్తం చేసింది. నాకు బెదిరింపు ఉత్తరాలు వచ్చినప్పుడు 19-20 ఏళ్ల వయసు. అంత చిన్న వయస్సులో చాలా విషయాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. కానీ ఇప్పుడు అలాంటివి ప్రభావితం చేయలేవు... అని అంది.
నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నాకు మార్గనిర్దేశనం చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటే లేనే లేరు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకోండి.. ద్వేషించేవారి గురించి చింతించకండి! అంటూ చెప్పేవారు లేరు. ప్రస్తుతం ఇండియాలో డానియల్ వెబర్ తో సన్నీలియోన్ సంతోషకర జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట సరోగసీలో వారసులకు జన్మనిచ్చారు. ఒక చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సన్నీ ముగ్గురు పిల్లలకు మామ్ ఇపుడు. ఆమెకు ఒక కుమార్తె నిషా .. కుమారులు నోహ్ .. ఆషేర్ ఉన్నారు.
స్కూల్లోను వెక్కిరింతలు వేధింపులు! అందాల సన్నీ లియోన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాల్యంలో ఎదుర్కొన్న చాలా అనుభవాలపైనా ఓపెనయ్యారు. తన చిన్నతనంలో పాఠశాలలో వేధింపులకు గురికావడం తనను జీవితాంతం ఎలా ప్రభావితం చేసిందో వెల్లడించారు. కెనడాలో పెరిగిన సన్నీ.. తన పాఠశాలలోని సాటి చిన్నారులు ఆమెను చూసే తీరు ఎంతో బాధపెట్టేదని గుర్తు చేసుకున్నారు. కెనడాలోని సిక్కు తల్లిదండ్రులకు జన్మించిన సన్నీ అసలు పేరు కరణ్ జీత్ కౌర్. తన సోదరుడితో కలిసి కెనడాలో పెరిగింది. యుక్తవయసులో యునైటెడ్ స్టేట్స్ కి వెళ్లింది.
చేతులు కాళ్ళపై ముదురు జుట్టు వెంట్రుకలతో బ్రౌనీ ఆకృతి గల భారతీయ అమ్మాయిగా అక్కడ గుర్తించడం చిక్కులు తెచ్చింది. తన శరీరం ఛాయ.. రంగు ప్రతిదీ వెక్కిరింతకు కారణమైందట. దానిని సన్నీ చాలా ఇబ్బందికరంగా భావించేది. తాను బాగా దుస్తులు ధరించలేదని గుర్తుచేసుకుంది. ఇది సరదా పడే వ్యవహారం కాదని కూడా వ్యాఖ్యానించింది. బెదిరింపు ఒక సైకిల్ లాంటిది అని... బెదిరింపులకు గురయ్యే వారు కూడా ఇటువంటి చర్యలను ఆశ్రయిస్తారని సన్నీ తెలిపారు. కానీ ఎవరైనా బెదిరింపులకు వ్యతిరేకంగా ఒక వైఖరి తీసుకుంటే.. చుట్టుపక్కల ప్రజల నుండి సహాయం తీసుకుంటే అప్పుడు కథ వేరుగా ఉంటుంది. బెదిరిస్తారని భయపడటంతో ప్రభుత్వ పాఠశాలకు బదులుగా కాథలిక్ పాఠశాలలో తనను తల్లిదండ్రులు చేర్చారని తెలిపారు.
కెరీర్ జర్నీ ఇదీ సంగతి! సన్నీలియోన్ ఐటమ్ గాళ్ గా బాలీవుడ్ లో పాపులరైంది. పలు భారీ చిత్రాల్లోను నటిగా అలరించింది. వెబ్ సిరీస్ లలోను సత్తా చాటింది. ప్రస్తుతం అర్జున్ బిజ్లానీతో కలిసి డేటింగ్ ఆధారిత రియాలిటీ షో స్ప్లిట్స్ విల్లా X4ని హోస్టింగ్ చేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన కన్నడ చిత్రం 'ఛాంపియన్'లోను సన్నీ కనిపించింది. ఆమె తెలుగులో విష్ణు మంచు సరసన మాస్ ఎంటర్ టైనర్ 'గిన్నా'లో నటించింది. ఈ ఏడాదిలో తమిళ చిత్రం 'ఓ మై గోస్ట్'లో కూడా కనిపించింది. సంవత్సరం ప్రారంభంలో సన్నీ హిందీలో 'అనామిక' అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. 2022లో అన్ని కమిట్ మెంట్లను పూర్తి చేసి కొత్త సంవత్సర వేడుకల కోసం సిద్ధమవుతోంది. సన్నీలియోన్ టైటిల్ పాత్రలో దక్షిణాదికి చెందిన ప్రముఖ యోధురాలు వీరమదేవి జీవితకథతో ఓ మూవీని ప్రారంభించినా కానీ దానిపై సరైన సమాచారం లేదు. తాజా సమాచారం మేరకు 31 డిసెంబర్ నైట్ ఈవెంట్లో తన పెర్ఫామెన్స్ కోసం సన్నీ సిద్ధమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అది ఎక్కడ? అన్నదానిపై సమాచారం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.