Begin typing your search above and press return to search.
రివైండ్ 2015 : ఆకాశంలో 12కొత్త తారలు
By: Tupaki Desk | 29 Dec 2015 5:30 PM GMTఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేళ అంటూ తన అందాల రాశి కోసం నటశేఖరుడు వేసుకున్న పాట మీకు తెలిసినదేకదా. అయితే ఈ ఏడాది మన సినీ వినీలాకాశంలో ఏకంగా 12మంది తారలు మెరిసారు. అదేనండి తెలుగు సినిమాలలో 12మంది కొత్త హీరోయిన్లు అలరించారు. వారిపై ఓసారి రీ లుక్కేద్దామా?
ఏడాది చివర్లో విడుదలైనా ఏడాది మొత్తం తెరారంగ్రేటం చేసిన హీరోయిన్లను దాటి వార్తలలో నిలిచిన భామ దిశా పటానీ. లోఫర్ సినిమాతో పూరి పరిచయం చేసిన హీరోయిన్ గా వార్తలలో నిలిచిన ఈ భామ తన అందచెందాలతో ప్రేక్షకులను అలరించడమే కాక తక్కిన దర్శకనిర్మాతల దృష్టిలో సైతం పడింది.
ఇక ఈ ఇయర్ మోస్ట్ అవైటింగ్ డెబ్యు గా ఎదురుచూసింది సయేషా సైఘల్ గురించే. వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సరసన బాలీవుడ్ నుండి దిగుమతైన ఈ అమ్మడు అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది. అందంలోనూ, అభినయంలోనూ కేవలం పాస్ మార్కులతో బయటపడింది.
ఇక తొలి సినిమాతోనే హిట్ లు సాధించిన వారి జాబితాలో 'పటాస్' - శృతి సోధి - 'సూర్య vs సూర్య' - త్రిద చౌదరి -'ఎవడే సుబ్రహ్మణ్యం' - మాళవిక నాయర్ -''కేరింత - సుకృతి - 'భలే మంచి రోజు' - వమీకా లు లక్కీ హ్యాండ్ ట్యాగ్ తో నిలవడమేకాక భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు.
వీరేకాక షార్ట్ ఫిలిం సంచలనం చాందినీ చౌదరి - రాగిణి ద్వివేది - సురభి - సయామీ ఖేర్ - సొనారిక వంటి భామలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. గతఏడాదే పరిచయమైనా ఈ ఏడాది గుర్తింపు పొందిన భామలలో కంచె - ప్రజ్ఞ జైస్వాల్ - కుమారి 21F హీబా పటేల్ లు ప్రత్యేక స్థానంలో నిలిచారు.