Begin typing your search above and press return to search.
డిసెంబర్ 20 ‘కాజలిజం డే’ అంట!.. ఫ్యాన్స్ పూనకాలు
By: Tupaki Desk | 21 Dec 2020 12:30 PM GMTసెలబ్రిటీలపై అభిమానులు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు.. ఇక, సినిమా నటుల మీద అయితే, చెప్పాల్సిన పనేలేదు. ఏం చేస్తారో..? ఎందుకు చేస్తారో..? ఎలా చేస్తారో కూడా అర్థం కాదు. లేటెస్ట్ గా.. కాజల్ అగర్వాల్ అభిమానులు కూడా డిసెంబర్ 20 (ఆదివారం)న సోషల్ మీడియాను ఊపేశారు.
‘కాజలిజం డే’ అంటూ ఈ అమ్మడి పేరును మోత మోగించారు ఫ్యాన్స్. కాజల్ పెళ్లి రోజున ఏ రేంజ్‌లో అయితే ట్రెండ్స్ కనిపించాయో.. అంతకు మించి అనే రీతిలో ట్రెండ్స్ కనిపించాయి. కాజల్ అభిమానులు ‘డిసెంబర్ 20ని’ వరల్డ్ కాజలిజం డేగా ప్రకటించుకొని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమ అభిమాన నటి ఫొటోలను షేర్ చేస్తూ వరుస ట్వీట్లతో రచ్చ చేశారు.
అసలింతకీ ఈ అకేషన్ కు కారణం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కలేదు. డిసెంబర్ 20 కాజల్ అగర్వాల్ బర్త్‌డే కాదు. మొన్ననే అయిపోయింది కాబట్టి పెళ్లి రోజు అనుకునే ఛాన్సే లేదు.. మరి ఈ ‘కాజలిజం’ ఉద్భవించడానికి కారణం ఏంటీ..? అనేది మాత్రం అభిమానులెవరూ ప్రత్యేకంగా ప్రకటించలేదు. ఫలానా రీజనంటూ ఏదీ లేకపోయినా… ఈ చందమామ పేరు మాత్రం ట్విట్టర్ వేదికగా నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అయ్యింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. కేజీఎఫ్ అప్‌డేట్ లాంటి హాట్ న్యూస్ కు తగ్గకుండా కాజల్ పేరు సోషల్ మీడియాను షేక్ చేసింది.
అయితే.. డిసెంబర్ 20వ తేదీన కాజల్ వాళ్ల మదర్ బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా తన తల్లికి బర్త్ డే విషెస్ చెబుతూ కాజల్ ఓ ట్వీట్ చేసింది. ఇందులో భావోద్వేగంగా స్పందించింది. ‘కాజలిజం డే’ ఏర్పడి, ట్రెండ్ అవ్వడానికి కారణం ఇదే కావొచ్చంటున్నారు పలువురు.