Begin typing your search above and press return to search.

2020లో అడుగు పెట్టే ముందు హుషారేదీ?

By:  Tupaki Desk   |   7 Dec 2019 5:30 PM GMT
2020లో అడుగు పెట్టే ముందు హుషారేదీ?
X
డిసెంబ‌ర్ అంటే క్రిస్మ‌స్ కీల‌కం. అంత‌కుముందు అటూ ఇటూ సినిమాలేవైనా రిలీజైనా హైప్ క‌నిపించ‌దు ఎందుక‌నో. ఈనెల‌ తొలి శుక్ర‌వారం వ‌చ్చిన సినిమాలు స‌గ‌టు ప్రేక్ష‌కుడిని అంత‌గా సంతృప్తిప‌ర‌చ‌లేక‌పోయాయి. డిసెంబ‌ర్ 6న కార్తికేయ `90 ఎం.ఎల్‌`.. ఐశ్వ‌ర్యారాజేష్ న‌టించిన `మిస్‌ మ్యాచ్‌`.. శ్రీ‌నివాస‌రెడ్డి తొలి సారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు`.. కొత్తోళ్ల‌తో `మ‌థ‌నం` ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డంలో త‌డ‌బ‌డ్డాయి. నాలుగు రిలీజైతే క‌నీసం ఒక్క‌టి అయినా ఆశించిన స్థాయిని రీచ్ కాలేక‌పోయాయి.

`ఆర్.ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ న‌టించిన `90 ఎం.ఎల్‌` చిత్రానికి రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ అయినా ఆశించిన స్థాయిలో క‌థ‌ క‌థ‌నాలు లేక‌పోవ‌డం ప్ర‌ధాన డ్రాబ్యాక్‌గా మారింది. డేలో మూడు పెగ్గులు ప‌డ‌క‌పోతే చ‌నిపోతాడ‌నే సిండ్రోమ్ వున్న హీరో క‌థ‌తో వ‌చ్చిన ఈ చిత్రం అంత‌గా కిక్ నివ్వ‌లేక‌పోయింది. సినిమా చూసి థియేట‌ర్ నుంచి బ‌య‌టకు వ‌స్తున్న ప్రేక్ష‌కులు మీడియా ముందు పెద‌వి విరిచేయ‌డం క‌నిపిస్తోంది. ఇక క‌మెడియ‌న్ శ్రీ‌నివాస‌రెడ్డి తొలిసారి ద‌ర్శ‌కుడిగా మారి న‌టించి రూపొందించిన చిత్రం `భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ సినిమాలో కామెడీ వున్నా స‌రైన ఎగ్జిక్యూష‌న్ కొర‌వ‌డింది. ఫ‌స్ట్ హాఫ్ పూర్త‌య్యే స‌రికే ప్రేక్ష‌కులు స‌హ‌నం కోల్పోయారు. క్లైమాక్స్ ఏమైనా వుందా అంటే అదీ లేదు.

ఉద‌య్ శంక‌ర్‌- ఐశ్వ‌ర్యారాజేష్‌ల `మిస్‌మ్యాచ్‌` టైటిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినా కంటెంట్ లో ప‌స లేక‌పోవ‌డంతో టైటిల్ కు త‌గ్గ‌ట్టే మిస్ మ్యాచ్ అనిపించుకుంది. శ్రీ‌నివాస‌సాయి న‌టించిన `మ‌థ‌నం` ఇండియాలో రిలీజ్ కాలేదు. కేవ‌లం అమెరికాలోనే రిలీజ్ అయింది. అక్క‌డ ఎవ‌రినీ ఆక‌ట్టుకోలేదు. దీంతో నెక్ట్స్ వీక్ సంగ‌తేంటి? అన్న చ‌ర్చా మొద‌లైంది. ఇక డిసెంబ‌ర్ 13న రెండో శుక్ర‌వారం సీనేంటో? ఇప్ప‌టికే `వెంకీ మామ‌`కు లైన్ క్లియ‌ర్ అయింది. సోలోగా వ‌స్తున్న `వెంకీమామ‌` బాగుంది అన్న టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వ‌ద్ద హుషారొస్తుంది. ఆ త‌ర్వాతి వారంలో ద‌బాంగ్ 3 .. రూల‌ర్.. ప్ర‌తిరోజు పండ‌గే చిత్రాల‌పై అంతో ఇంతో అంచ‌నాలున్నాయి కాబ‌ట్టి అప్ప‌టివ‌ర‌కూ వెంకీమామ‌నే క‌థ న‌డిపించాల్సి ఉంటుంది మ‌రి.