Begin typing your search above and press return to search.
మళ్లీ డీసెంట్ హిట్ కొట్టిన మసూద
By: Tupaki Desk | 29 Dec 2022 9:47 AM GMTఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ తో వచ్చిన చిన్న సినిమాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. చిన్న సినిమాలు ఒక వేళ థియేటర్ రన్ లో కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేక పోయినా కూడా ఓటీటీలో అయినా డీసెంట్ సక్సెస్ ను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాయి.
తాజాగా థియేటర్ ల ద్వారా విడుదల అయిన మసూద సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే వచ్చిన రివ్యూలకు మరియు టాక్ కు తగ్గట్లుగా కలెక్షన్స్ రాలేదు అనేది బాక్సాఫీస్ వర్గాల వారి వాదన.
కలెక్షన్స్ వచ్చినా రాకున్నా థియేటర్ల లో మసూద సినిమా హిట్ అనే టాక్ దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీ లో కూడా మసూద మంచి విజయాన్ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది.
ఈ ఏడాది మేటి చిత్రాల జాబితాలో ఆహా ఓటీటీ వారు మసూద సినిమాను నిలిపే స్థాయిలో ఈ సినిమాను చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
తిరు మరియు సంగీత కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు. రాహుల్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా ఒక రొటీన్ హర్రర్ సినిమా అన్నట్లుగా కాకుండా ఆకట్టుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కామెడీని జొప్పించకుండా డీసెంట్ హర్రర్ స్క్రీన్ ప్లేను రన్ చేశారు.
మంచి హర్రర్ సినిమాలకు మొహం వాచి ఉన్న తెలుగు ప్రేక్షకులు మసూద సినిమా ను ఆస్వాదిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా థియేటర్ రిలీజ్ లో మరింత మంచి స్పందన దక్కించుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఓటీటీ లో మాత్రం సూపర్ హిట్ మూవీ అన్నట్లుగా మసూద నిలిచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.