Begin typing your search above and press return to search.
మా ఎలక్షన్స్ : ఓటు వేసిన తర్వాతే షూటింగ్
By: Tupaki Desk | 7 Oct 2021 12:30 PM GMTసినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మా ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చేసింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగబోతున్నాయి. మా ఎన్నికల్లో ఎప్పుడు కూడా కనీసం 40 నుండి 50 శాతం ఓటింగ్ కూడా జరగడం లేదు. చాలా మంది స్టార్స్ పోలింగ్ పై ఆసక్తి చూపడం లేదు.. కొందరు చెన్నై ఇతర ప్రాంతాల్లో దేశాల్లో ఉన్నారు. కనుక మా ఎన్నికల్లో ప్రతి సారి కూడా చాలా తక్కువ స్థాయిలోనే జరుగుతుంది. కాని ఈసారి మాత్రం 60 శాతం వరకు పోలింగ్ ను జరిపించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించినంత వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కొందరు దూర ప్రాంతంలో ఉంటే పోస్టల్ బ్యాలన్ ను వినియోగిస్తున్నారు. మరి కొందరిని పిలిపించేలా చేస్తున్నారు.
ఇక ఎన్నికల రోజు షూటింగ్ లేకుండా ఉండాలని నిర్ణయించారు. అందుకోసం నిర్మాతల మండలికి మా విజ్ఞప్తి చేసింది. మా ఎన్నికల సందర్బంగా షూటింగ్ లను మద్యాహ్నం తర్వాత నుండి ప్రారంభించాలని పేర్కొన్నారు. షూటింగ్ లో ఓటింగ్ లో పాల్గొన్న తర్వాత వెళ్లాలని సూచిస్తున్నారు. నిర్మాతల మండలి కూడా సినిమా షూటింగ్ ను ఎన్నికల రోజు మద్యాహ్నం తర్వాత ప్రారంభించాలని సూచించింది. అందరు నిర్మాతలు కూడా మా సభ్యులు ఓటింగ్ లో పాల్గొనేందుకు సహకరించేలా షూటింగ్ టైమ్ ను మార్చుకోవాలని నిర్మాతల మండలి మరియు మా ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలంటూ సభ్యులందరికి కూడా మా ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది.
ఈ సారి స్టార్స్ ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాజకీయ ఎన్నికల వేడిని తలపిస్తున్న మా ఎన్నికల విషయంలో చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేస్తున్న మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ఇద్దరు కూడా నేనే గొప్ప అంటే నేనే గొప్ప అంటూ విమర్శల పర్వం కొనసాగింది. కొందరు స్థానికత అంటూ కూడా మంచు విష్ణుకు మద్దతు తెలిపితే కొందరు ప్రతిభ కలిగిన వ్యక్తి మంచి సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి కనుక ప్రకాష్ రాజ్ ను ఎన్నుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఇద్దరి మద్య పోటీ చాలా స్పష్టంగా సీరియస్ గా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది పదవ తారీకు వరకు ఆగితే కాని తేలే అవకాశం లేదు.