Begin typing your search above and press return to search.
బిగ్ బాస్.. హాట్ న్యూస్
By: Tupaki Desk | 4 May 2018 9:48 AM GMTబాలీవుడ్‌లో బిగ్ బాస్ హిట్టవ్వడంతో ప్రాంతీయ భాషల్లో కూడా మొదలైంది బిగ్ బాస్. తమిళంలో వివాదాలతో నిండి పోయి ఫ్లాఫైపోయింది. తెలుగులో మాత్రం అదరగొట్టి ఫస్ట్ సీజన్ హిట్ అనిపించుకుంది. ఆ హిట్ వెనుక జూనియర్ ఎన్టీయార్ కష్టం కూడా చెప్పుకోవాల్సిందే. వీకెండ్‌లో వచ్చే షో బోరు కొట్టకుండా నడిపించాడు. త్వరలో రెండో సీజన్ ప్రారంభమవ్వబోతోంది. దీనికి సంబంధించి వెరీ హాట్ న్యూస్ తెరపైకి వచ్చింది.
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో టీవీ సెలెబ్రిటీలు, సినీ రంగానికి చెందిన వారినే తీసుకున్నారు. రెండో సీజన్‌లో మాత్రం ప్లాన్ మార్చారు. హిందీ బిగ్‌బాస్‌లో ఎలా అయితే కామనర్స్ అదేనండి మనలాంటి సామాన్యులకు ఛాన్స్ ఇవ్వనున్నారట. ఇందుకు సంబంధించి ఒక వీడియోను బిగ్‌బాస్ మొదటి సీజన్ పార్టిసిపెంట్ దీక్షా పంత్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియోను బట్టి కామనర్స్ కూడా ఆడిషన్ కు వెళ్లి బిగ్‌బాస్ షో లో పాల్గొనే అవకాశం దక్కించుకోవచ్చు. ఎంతమంది కామనర్స్‌ను తీసుకుంటారనేది లెక్క తెలియదు కానీ... ఇద్దరు నుంచి ముగ్గురికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని టాక్.
త్వరలో ప్రారంభమయ్యే రెండో సీజన్‌కు న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అతనికి దాదాపు మూడున్నర కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇచ్చి మరీ స్టార్ మా ఒప్పందం కుదుర్చుకుంది. 30 రోజుల డేట్ లను నాని బిగ్ బాస్ కోసం ఇచ్చేశాడు. ఇప్పటికే సెలెబ్రిటీ పార్టిసిపెంట్ల ఎంపిక కూడా జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఇక మిగిలింది కామనర్స్ బ్యాచే. వారిది కూడా అతి త్వరలో అవ్వగొట్టి... షోను టెలీకాస్ట్ చేయడానికి బిగ్ బాస్ టీమ్ సిద్ధమవుతోంది.