Begin typing your search above and press return to search.

వేదం బ్యూటీకి ఫిజియోథెరపీ...

By:  Tupaki Desk   |   2 July 2015 1:30 PM GMT
వేదం బ్యూటీకి ఫిజియోథెరపీ...
X
వేదం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది ముంబై గాళ్‌ ధీక్ష సేథ్‌. తొలి సినిమాతోనే ఒడ్డు పొడుగు, అందం ఉన్న ఏకైక నాయికగా తెలుగువారి మనసుల్లో దూరిపోయింది. అయితే ఆ తర్వాత ఎన్ని అవకాశాలొచ్చినా లక్‌ కలిసిరాలేదు. సక్సెస్‌ రాక టాలీవుడ్‌లో కెరీర్‌ చాలించింది. తర్వాత అమెరికా వెళ్లిపోతున్నా అంటూ ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయింది. కట్‌ చేస్తే కొన్నాళ్లకు బాలీవుడ్‌లో ఓ కుర్రహీరో సరసన నటించి అక్కడ ఓకె అనిపించుకుంది.

ఆ వెంటనే ఓ తమిళ చిత్రానికి సంతకం చేసి వార్తల్లోకొచ్చింది. ఇక తమిళ్‌ నుంచి మరోసారి తెలుగుకి వస్తుందనే అనుకున్నారంతా. కానీ ఇంతలోనే కెరీర్‌లో మరో ఊహించని ఝలక్‌. ధీక్ష కాలు విరిగింది అన్న షాకింగ్‌ న్యూస్‌ తెలిసింది. ప్రస్తుతం డాక్టర్ల బెడ్‌ రెస్ట్‌ తీసుకోమన్నారు. మూడు నెలల పాటు కేవలం బెడ్‌కే పరిమితం.ఇప్పటికే కెరీర్‌ నత్తనడకన సాగడంతో ఈ ముకుపుడకల సుందరి గుండెకు తీవ్ర గాయమైంది. గాయానికి గాయమే మందు అన్న తీరుగా ఇప్పుడు కాలికి గాయమైంది. ఈ గాయాన్ని మాన్పడానికి మూడు నెలలు ఎదురు చూడాల్సొస్తోంది.

ప్రస్తుతం పైలేట్స్‌ సాయంతో నడిచే ప్రయత్నం చేస్తోంది. యాస్మిన్‌ కరాచీవాలా సారథ్యంలో ఫిజియో థెరపీ చేయించుకుంటోంది. త్వరలోనే కోలుకుని తమిళ సినిమాలో నటిస్తానన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కొన్ని కారణాల వల్ల సినిమా సెట్స్‌కెళ్లడం ఆలస్యమైంది. అది ఈ అమ్మడికి కలిసొచ్చింది. ఏ గాయాన్ని అయినా కాలమే మాన్పుతుంది. అంతవరకూ ధీక్షగా వెయిట్‌ చేయాల్సిందే మరి!