Begin typing your search above and press return to search.
ధీక్షాసేత్‌ని మళ్ళీ బుక్ చేసేశారు
By: Tupaki Desk | 17 March 2015 4:02 AM GMTముక్కుపుడకల సోయగం ధీక్షాసేత్‌ని తెలుగు జనాలు మర్చిపోలేదింకా. వేదం, వాంటెడ్, మిరపకాయ్ లాంటి సినిమాల్లో నాయికగా నటించింది. మనవాళ్లు అవకాశాలైతే ఇచ్చారు కానీ అదృష్టాన్ని ఇవ్వలేకపోయారు. ఫలితం ధీక్ష ఫలించలేదు. అనుకున్న రేంజు స్టార్ కాలేకపోయింది. తను నటించిన ప్రతి సినిమాలో ఇద్దరు ముగ్గురు నాయికలు ఉండడం కూడా కెరీర్‌కి పెద్ద మైనస్ అయ్యింది.
ఏదేమైనా ధీక్ష ఆ క్రమంలోనే 2011లో కోలీవుడ్‌లోకి ప్రవేశించింది. తొలుత విక్రమ్ సరసన రాజాపట్టాయ్ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్. అయినా అక్కడా అడపాదడపా సినిమాలొచ్చాయి. కానీ మధ్యలోనే అస్సలు తనని సంప్రదించే దర్శకనిర్మాతలే లేకపోవడంతో పై చదువులు పేరుతో అమెరికా వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే బాలీవుడ్‌లో 'లేఖర్ హై దిల్ దివానా' అనే చిత్రంలో నాయికగా అవకాశం వచ్చింది. అప్పటికే రూపురేఖల్లో లావణ్యం పెంచుకున్న ధీక్ష అక్కడ ఆరంభమే విజయం అందుకుంది. కానీ ఆశించిన అవకాశాలు మాత్రం రాలేదు.
ఇటీవలే మరో ఛాన్సొచ్చింది. అయితే ఈసారి కోలీవుడ్‌లో. ధనుష్ నిర్మాతగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ఎంపికైంది. ఈ చిత్రంలో శింబు కథానాయకుడిగా నటిస్తున్నాడు. వేసవిలో సెట్స్‌కెళ్లనున్నారు. ధీక్ష మళ్లీ వస్తోంది. ఈసారి అదృష్టం ఎలా ఉందో కాస్త వేచి చూడాల్సిందే.