Begin typing your search above and press return to search.

న్యూడ్ మ్యారేజ్ అంటున్న రాఖీ-దీపక్

By:  Tupaki Desk   |   30 Nov 2018 11:53 AM GMT
న్యూడ్ మ్యారేజ్ అంటున్న రాఖీ-దీపక్
X
రాఖీ సావంత్ త్వరలో పెళ్ళి చేసుకోబోతుంది. దీపక్ కలాల్ అనే సోషల్ మీడియా సెన్సేషన్ ను చేసుకుంటానని ప్రకటించగానే అది పెద్ద వార్త అయిపోయింది. ఇప్పుడు ఇద్దరూ ఇంకాస్త ముందుకెళ్ళి ఇన్ స్టాగ్రామ్ అంటేనే జనాలు భయపడేలా చేస్తున్నారు. రీసెంట్ గా రాఖి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ నాలుగు ఐదు వీడియోలు పోస్ట్ చేసింది.

ఒక వీడియో లో ప్యాంట్ వేసుకొని బ్రాలాగా ఒక క్లాత్ చుట్టుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఆనాటి బాలీవుడ్ క్లాసిక్ సాంగ్ 'సత్యం శివం సుందరం' వస్తుంటే దానికి డ్యాన్సు చేశాడు. ఎలా ఉందో చెప్పాలంటే నోటి మాటలు రావు ఎవరికైనా.

ఇంకో వీడియోలో 'హాయ్ హాయ్ ఏ మౌసమ్ హాయ్ మజ్ బూరి.. ఏ మౌసమ్ ఏ దూరి' అనే పాటకు చీర కట్టుకుని బ్రా వేసుకుని డ్యాన్సు చేశాడు. దీనికి రాఖీ పెట్టిన క్యాప్షన్ రాయలేని భాషలో ఉంది. మరో వీడియోలో దీపక్ కలాల్ అమ్మ మాట్లాడినట్టుగా ఉంది.. అందులో "అందరూ సిగ్గు పడండి.. నేను దీపక్ కలాల్ అమ్మని. దీపక్ చేసిన దాన్లో తప్పేముంది నచ్చినట్టు బ్రా వేసుకుంటాడు...మరోటి వేసుకుంటాడు..డ్యాన్స్ చేస్తాడు. నా కొడుకుని.. నా కోడలు రాఖి సావంత్ ను తిట్టకండి. అయినా వాళ్ళను తిడితే మిమ్మల్ని చంపేస్తాను."

ఇంకొ వీడియో లో 'సందలీ సందలీ నైనా విచ్ తేరా నామ్ ముండియా' అనే ఓ పంజాబీ సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంటే దానికి చుడిదార్ వేసుకుని డ్యాన్స్ చేశాడు. ఇంతటితో ఆగలేదు ఈ హంగామా.. మరో వీడియోలో చక్కగా బట్టలేసుకున్న దీపక్ కలాల్ చేతిలో ఒక అరటి పండు పట్టుకున్నాడు. ఏమన్నాడంటే "రాఖి లాస్ ఏంజెలెస్ లో మన పెళ్ళికి ఒక కండిషన్. ఇద్దరం నగ్నం గా మారి పెళ్ళి చేసుకుందాం. అప్పుడు ఇలాంటి అరటిపండు ముందొకటి వెనక ఒకటి నువ్వు కట్టుకోవాలి." ఈ వీడియో పోస్ట్ చేసిన రాఖీ ఇలా క్యాప్షన్ ఇచ్చింది "యస్ మై లవ్.. న్యూడ్ మ్యారేజ్ చేసుకుందాం."

ఇలా ఉంది వరస. ఈ దరిద్రపు గొట్టు వీడియోలకు బండ బూతులతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాఖీనే దరిద్రం అనుకుంటే దీపక్ మహా దరిద్రుడిలా ఉన్నాడని తిట్టిపోస్తున్నారు. నీకు ఈ చెక్క గాడే దొరికాడా...ఇదంతా మా ఖర్మ అని నెటిజనులు తమను తాము తిట్టుకుంటున్నారు. ఈ అరాచాకాన్ని ఏమాత్రం భరించలేకుండా ఉన్నామని ఇద్దరి మీద ఇన్ స్టాగ్రామ్ వారికి రిపోర్ట్ చేస్తే.. ఖాతాలు బ్లాక్ చేస్తారని దరిద్రం శాశ్వతంగా వదిలిపోతుందని అంటున్నారు.