Begin typing your search above and press return to search.
దీపికా బికినీ వివాదం... ముందు ముందు నగ్నంగా చూస్తామేమో
By: Tupaki Desk | 17 Dec 2022 8:42 AM GMTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం పఠాన్ లోని బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకునే బికినీ మరియు ఆమె అందాల ఆరబోత వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఇన్నాళ్లు దీపికా పదుకునే ఎన్నో సినిమాల్లో అందాల ఆరబోత చేసింది. కానీ ఇప్పటి వరకు రాని విమర్శలు ఈసారి ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా శక్తిమాన్ స్టార్ ముఖేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలతో మరోసారి దీపికా పదుకునే యొక్క బికినీ వివాదం వార్తల్లో నిలిచింది. బేషరమ్ రంగ్ పాట చూడ్డానికి అసభ్యంగా ఉంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి పాటలకు సెన్సార్ బోర్డ్ ఎలా అనుమతిస్తుంది అంటూ ఆయన ప్రశ్నించాడు.
ముఖేష్ ఖన్నా ఇంకా మాట్లాడుతూ... సినిమా పరిశ్రమ లో అశ్లీలత ఎక్కువ అయ్యింది. ఇప్పటికే పొట్టి దుస్తుల్లో హీరోయిన్స్ ను చూస్తున్నాం. ముందు ముందు వాళ్లని మనం నగ్నంగా చూస్తామేమో అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి వాటికి అంగీకరించడానికి మనదేశం ఏమీ స్వీడన్.. స్పెయిన్ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇలాంటి అందాల ప్రదర్శన ఏ ఒక్కరి భావాలను నమ్మకాలను ఇబ్బంది పెట్టకూడదు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఇలాంటి డ్రెస్ లు వేసుకోవడం అనేది హీరోయిన్స్ కి తగదు. యువత ను తప్పుద్రోవ పట్టించే ఇలాంటి సినిమాలు మరియు అందాల ప్రదర్శణకు సెన్సార్ ఓకే చెప్పకూడదు అంటూ ముఖేష్ ఖన్నా విజ్ఞప్తి చేస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.