Begin typing your search above and press return to search.

హ‌ద్దులు దాటిన దీపిక‌.. చిక్కుల్లో 'ప‌ఠాన్'!

By:  Tupaki Desk   |   14 Dec 2022 7:30 AM GMT
హ‌ద్దులు దాటిన దీపిక‌.. చిక్కుల్లో ప‌ఠాన్!
X
బాలీవుడ్ సినిమాల‌ని గ‌త కొన్ని నెల‌లుగా బాయ్ కాట్ గండం వెంటాడుతున్న విష‌యం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మృతి నుంచి బాలీవుడ్ బాయ్ కాట్ వివాదం వెంటాడుతూ ప‌లువురు స్టార్ ల సినిమాల‌కు చుక్క‌లు చూపించిన విష‌యం తెలిసిందే. రీసెంట్ గా అమీర్ ఖాన్ ట‌నించిన 'లాల్‌సింగ్ చ‌డ్డా'కు కూడా ఇదే వివాదం చుట్టుముట్ట‌డం.. నెట్టింట నెటిజ‌న్స్ రికార్డు స్థాయిలో ఈ మూవీని బాయ్ కాట్ చేయండ‌ని హ్యాష్‌ట్యాగ్ ల‌తో జోరుగా ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే.

ఈ ప్ర‌చారం కార‌ణంగా ' లాల్‌సింగ్ చ‌డ్డా ' బాక్సాఫీస్ వ‌ద్ద దేశ వ్యాప్తంగా డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఆ రువాత ఇదే త‌ర‌హాలో 'బ్ర‌హ్మ‌స్త్ర‌'ని సైతం క‌ర‌ణ్ జోహార్ కార‌ణంగా బాయ్ కాట్ చేయాలంటూ ప‌లువురు నెటిజ‌న్ లు నెట్టింట ట్రోల్ చేశారు. అయితే 'బ్రహ్మాస్త్ర‌' కంటెంట్ ఫ‌ర‌వాలేద‌ని పించ‌డంతో బాయ్ కాట్ బ్యాచ్ ఎంత‌గా టార్గెట్ చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. తాజాగా బాయ్ కాట్ బ్యాచ్ క‌న్ను షారుఖ్ ఖాన్ న‌టిస్తున్న 'ప‌ఠాన్‌' మూవీపై ప‌డింది. ఫ‌స్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసిన ద‌గ్గ‌రి నుంచే ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ప్ర‌చారం జోరందుకుంది.

వ‌చ్చే ఏడాది 2023 జ‌న‌వ‌రి 23న అత్యంత భారీ స్థాయిలో హిందీ, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా విడుద‌ల చేసిన టీజ‌ర్ పై కూడా ఓ రేంజ్ లో సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోలింగ్ జ‌రిగింది. ఇదిలా వుంటే సినిమా రిలీజ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్‌తాజాగా ఈ మూవీ నుంచి 'బేష‌ర‌మ్ రంగ్‌' అంటూ ఓ బీచ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాట‌లో దీపికా ప‌దుకోన్ మునుపెన్న‌డూ లేనంతా ఊహించ‌ని స్థాయిలో బికినీ ధ‌రించి అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేసిన తీరు, ఈ పాట‌లోని చివ‌రి స‌న్నివేశాల్లో కాషాయ రంగు బికినీ ధ‌రించి వెగ‌టు పుట్టించే భంగిమ‌లో షారుఖ్ ని హ‌త్తుకున్న తీరు పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ పాట‌లో హీరోయిన్ దీపికా ప‌దుకోన్ రెచ్చిపోయి అందాల విందు చేసింది. ఇంత వ‌ర‌కు ఈ రేంజ్‌లో టూ పీస్ బికినీల్లో క‌నిపించ‌ని దీపిక ఓ పాట‌లో ఈ స్థాయిలో రెచ్చిపోవ‌డం మాత్ం ఇదే తొలిసారి. అందులోపై కాషాయ రంగు బికినీలో టూమ‌చ్ గ్లామ‌ర్ షో చేయ‌డంతో హిందూ సంఘాలు తీవ్ర అభ్యంత‌రంవ్య‌క్తం చేస్తూ ఈ సినిమాని బాయ్ కాట్ చేస‌యాలంటూ నినాదాన్ని ఎత్తుకున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా దీపికిని,ప‌టాన్ మూవీని ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టాయి.

అంతే కాకుండా పెళ్లైన యువ‌తి మ‌రీ ఇంత‌లా రెచ్చిపోయి టూ పీస్ బికినీలో అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంపై గ‌ట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో మ‌రీ ఇంత ప‌చ్చిగా ఎవ‌రూ న‌టించ‌లేద‌ని, ఒక స్టార్ హీరోయిన్ అయి వుండి పెళ్లైనా కూడా ఇలా రెచ్చిపోవ‌డం ఏమీ బాగాలేద‌ని దీపిక‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమ‌ర్శ‌ల‌పై దీపిక చాలా ఘాటుగా స్పందించిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. నా భ‌ర్త‌కు లేని అభ్యంత‌రం మీకెందుక‌ని స‌మాధానం చెప్పింద‌ని అంటున్నారు. అయినా స‌రే ఆ స‌మాధానంపై కూడా భారీగా ట్రోలింగ్ మొద‌లైంది. భ‌ర్త‌కు బాధ‌లేక‌పోతే ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిగా వుందిక‌దా అని మండిప‌డుతున్నారట‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.