Begin typing your search above and press return to search.
ద్రౌపది కాక ముందే తెలుగులో పాపులారిటీ?
By: Tupaki Desk | 24 July 2020 12:10 PM GMTఅల్లు అరవింద్ `రామాయణం` సిరీస్ గురించి చర్చ సాగుతున్న క్రమంలో దీపిక పేరు ప్రముఖంగా హైలైట్ అయ్యింది. అప్పట్లో శ్రీరాముడిగా హృతిక్ పేరుని.. సీతాదేవిగా దీపిక పేరుని పరిశీలిస్తున్నారన్న ప్రచారం హీటెక్కించింది. కానీ దానిపై సరైన అప్ డేట్ ఏదీ లేదు. ఆ తర్వాత మధు మంతెనతో కలిసి అరవింద్ బాలీవుడ్ లో నిర్మించనున్న `మహాభారతం 3డి`లో ద్రౌపది పాత్రకు దీపిక పేరు పరిశీలనలో ఉందని ప్రచారమైంది. కానీ దానికి సంబంధించి సరైన సమాచారం ఏదీ ఇటీవల రాలేదు.
అయితే ఆ రెండు ప్రాజెక్టులు ఒకవేళ సకాలంలో టేకాఫ్ అయ్యి ఉంటే ఈపాటికే దీపిక పేరు సౌత్ లో మార్మోగేది. అందునా తెలుగు నాట బాగా పాపులరయ్యేది. పద్మావత్ 3డి సినిమాతో కొంతవరకూ దీపికను అర్బన్ యూత్ గుర్తించగలరేమో కానీ తెలుగు పల్లెల్లో ఇంకా అంతటి పాపులారిటీ ఈ పొడుగు కాళ్ల సుందరి లేదు. ఇక్కడ అగ్ర హీరోల సరసన నటిస్తేనే ఈ అమ్మడికి ఆ గుర్తింపు దక్కుతుంది కానీ అది ఇన్నాళ్లు జరగలేదు.
మొన్నటికి మొన్న డార్లింగ్ ప్రభాస్ సరసన దీపిక నటిస్తోంది అనగానే ఇక్కడా తన పేరు మార్మోగిపోయింది. కేవలం అర్బన్ లోనే కాక పల్లె పల్లెనా దీపిక గురించిన ముచ్చట సాగింది. బాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా రాజ్యమేలుతున్న దీపికను ప్రభాస్ సరసన ఎంపిక చేసుకున్న అశ్వనిదత్ బృందంపై ప్రశంసలు కురిసాయి. ప్రభాస్ నటించే సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సరైన ఎంపిక అంటూ పొగడ్తలు వినిపించాయి. ఇక దీపిక పదుకొనే ఈగోయిస్టిక్ క్యారెక్టర్ పైనా ఇటీవల ప్రభాస్ అభిమానుల్లో వాడి వేడి చర్చ సాగిన సంగతి తెలిసిందే. ఉత్తరాది సూపర్ స్టార్ గా తనకు మేల్ డామినేషన్ అస్సలు నచ్చదని కూడా తన ట్వీట్ వెల్లడించింది. ఆ క్రమంలోనే దీపిక పేరు అన్నిచోట్లా మార్మోగింది. మొత్తానికి ద్రౌపది కానీ సీత కానీ కాకముందే ఇక్కడ తెలుగు ప్రేక్షకులు దీపికను వోన్ చేసుకున్నట్టే.
రోబో సినిమాతో ఐశ్వర్యారాయ్ కి ఎంతటి గొప్ప గుర్తింపు దక్కిందో అంతకుమించి దీపికకు గుర్తింపు దక్కే వీలుంటుంది సౌత్ లో. ఇక ఐష్ తో పోలిస్తే దీపిక చాలా జూనియర్ సౌత్ లో. అందుకే తనకు ప్రభాస్ వల్లనే సౌత్ లో మైలేజ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి స్టార్ సరసన దీపిక నటిస్తోంది అంటూ ఇప్పటికే బాలీవుడ్ లోనూ మోత మోగుతోంది. ఇది కూడా తనకు గొప్ప గౌరవం కిందే లెక్క. దీపిక నటించిన 83 మూవీ ఇంకా రిలీజ్ కి రావాల్సి ఉంది.