Begin typing your search above and press return to search.

మ‌హేష్ పాన్ ఇండియాలో దీపిక‌నా..అంత‌కు మించా?

By:  Tupaki Desk   |   19 Oct 2022 11:30 AM GMT
మ‌హేష్ పాన్ ఇండియాలో దీపిక‌నా..అంత‌కు మించా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్‌-రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తొలి పాన్ ఇండియ‌న్ చిత్రానికి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. రాజ‌మౌళి విజువ‌లైజేష‌న్ కి త‌గ్గ‌ట్టు దిగ్గ‌జ రైట‌ర్ క‌థ‌ని సిద్దం చేస్తున్నారు. ఇప్ప‌టికే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గా రివీల్ అయింది. ఆఫ్రిక‌న్ అడ‌వుల నేప‌థ్యంలో సాగే స్టోరీగా తెలుస్తోంది.

కొన్ని వాస్త‌వ సంగ‌తులు ఆధారంగా ఈ క‌థ‌ని మ‌లుస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఇందులో మ‌హేష్ తో జ‌త క‌ట్టే హీరోయిన్ ఎవ‌రు? అంటే అంంచ‌నాలు కూడా భారీస్థాయిలోనే ఏర్ప‌డుతున్నాయి. మ‌హేష్ బ్యూటీని..ఇమేజ్ ని మ్యాచ్ చేసే హీరోయిన్ ని ఎంపిక చేయ‌డం అంత సుల‌వువైన ప‌ని కాదు. పైగా పాన్ ఇండియ‌న్ మూవీ కాబ‌ట్టి అన్ని భాష‌ల‌కు స‌రితూగే హీరోయిన్ కావాలి.

అందుకోసం రాజ‌మౌళి దేశం మొత్తం జ‌ల్లెడ ప‌ట్టాల్సిందే. అన్ని భాష‌ల్ని స్ట‌డీ చేసి ఫేమ‌స్ హీరోయిన్ సీన్ లోకి తేవాలి. అయితే అందుకు ఆప‌న్ష‌న్ గా రాజ‌మౌళి ముందుగా తీసుకునేది బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌నే. అక్క‌డ భామ‌ల్నే తీసుకునే ఛాన్స్ ఉంద‌న్న‌ది సుస్ప‌ష్టం. మ‌రి రాజ‌మౌళి ఛాయిస్ లో ముందు వ‌రుస‌లో ఎవరున్నారు? అంటే దీపిక ప‌దుకొణే పేరు తెర‌పైకి వ‌స్తోంది.

మ‌హేష్ ఇమేజ్ని మ్యాచ్ చేసే ఏకైక హీరోయిన్ దీపిక‌ను భావిస్తున్న‌ట్లు లీకులందుతున్నాయి. మ‌రి ఆమెను తీసుకుంటారా? బాలీవు్డ్ ని కాద‌ని హాలీవుడ్ కే వెళ్లిపోతారా? అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియాని మించి పాన్ వ‌ర‌ల్డ్ లోనే ప్లాన్ చేస్తున్నార‌న్న‌ది మ‌రో బోగ‌ట్టా. అదే నిజ‌మైతే జ‌క్క‌న్న హాలీవుడ్ ఫేమ‌స్ హీరోయిన్ ని దించేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేదు.

జ‌క్క‌న్న క‌థ‌ల్లో హీరో పాత్ర‌ని హీరోయిన్ ఎలాగూ డామినేట్ చేయ‌దు. అన్నింటినీ స‌మ‌తూకంలో బ్యాలెన్స్ చేస్తారు కాబ‌ట్టి హాలీవుడ్ కి వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. మ‌రి వీట‌న్నింటిపై క్లారిటీ రావాలంటే స‌మ‌యం ప‌డుతుంది. వ‌చ్చే ఏడాది ప్రారంభ‌మ‌య్యే ప్రాజెక్ట్ కాబ‌ట్టి అందుకు చాలా స‌మ‌యం ఉంది. ప్ర‌స్తుతం మ‌హేష్ త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.