Begin typing your search above and press return to search.

దీపిక సినిమా ఆగిపోయింది.. అందువల్లే!

By:  Tupaki Desk   |   20 Jan 2021 12:30 AM GMT
దీపిక సినిమా ఆగిపోయింది.. అందువల్లే!
X
దీపికా పదుకొనే బాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్ గా కొనసాగుతోంది. తనదైన నటనతో యావత్ భారతాన్ని మెప్పిస్తూ టాప్ పొజిషన్లో కొనసాగుతోందీ బ్యూటీ. అయితే.. ఓ వైపు నటిస్తూనే మరోవైపు సినీ నిర్మాణంలోనూ సత్తాచాటాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమైంది కూడా.

ప్రొడ్యూసర్ మధు మంతెనతో కలిసి ఓ ప్రాజెక్టును తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేసిందీ బ్యూటీ. దీనికి మధు మంతెన కూడా ఓకే చెప్పారు. ఇద్దరూ కలిసి స్టోరీని కూడా ఫైనల్ చేశారు. మహాభారతంలోని ప్రధాన ఘట్టాన్ని సినిమాగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

అంతేకాదు.. ఈ చిత్రంలో దీపిక ద్రౌపది పాత్రలో నటించడానికి సిద్ధమైంది. టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేశారు మేకర్స్. ఇదంతా జరిగి చాలా కాలమైంది. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ మూవీని నిలిపేస్తున్నారట!

ఈ ప్రాజెక్టును టేకోవర్ చేసే దర్శకుడు దొరక్కపోవడమే అసలు కారణమట! ఈ మూవీని తెరకెక్కించేందుకు పలువురు దర్శకులను అనుకున్నప్పటికీ.. వారికి ఇతర ప్రాజెక్టులు ఉండడం వల్ల కుదరలేదట. సమీప భవిష్యత్ లోనూ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ కనిపించకపోవడంతో రద్దు చేసుకోవడమే మేలని నిర్ణయించుకున్నారట దీపిక, మధు.