Begin typing your search above and press return to search.

ఆ డ్రస్సు మాకోసం.. మీకోసం కాదు

By:  Tupaki Desk   |   6 May 2017 5:25 AM GMT
ఆ డ్రస్సు మాకోసం.. మీకోసం కాదు
X
రెడ్ కార్పెట్ పై నడిచే ప్రతీ నటికి వచ్చిన విమర్శ ఒకటే.. వాళ్ళు వేసుకొచ్చిన డ్రస్ గురించి మేకప్ గురించి సెటైర్లు పడుతూనే ఉంటాయ్. ఇది మన ఇండియా హీరోయిన్స్ ​కు ​ మాత్రమే కాదు హాలీవుడ్ స్టార్స్ కూడా ఎదుర్కుంటున్నారు. అసలు వాళ్ళు వచ్చిన పని గురించి ఎవ్వరూ అడగరు కాని ఫోటోలు తీసి రచ్చ రచ్చ చేస్తారు. ఈ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమెరికా ఫిల్మ్స్ లోకూడా నటిస్తున్న ప్రియాంకా చోప్రా కు సోషల్ మీడియాలో చేదు అనుభవం మిగిలిచింది.

ఇప్పుడు దీపికా వంతు వచ్చింది. మెట్ గళా 2017 లో మొన్న అడుగుపెట్టింది. అందరిలాగానే లాంగ్ గౌన్ వైట్ స్లిప్ డ్రస్ వేసుకొని వెళ్లింది. దీపికా డ్రస్ కు మంచి ఆమోదమే దొరికింది. ఇప్పుడు రెండు రోజుల తరువాత అక్కడ ప్రెస్ డ్రస్ గురించి అడగగా ''నేను ప్రతీ దాన్ని ఒక కొత్త అవకాశంగా చూస్తాను. దాన్ని నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మేము మా క్రియేటివ్ టీమ్ కలిసి పని చేస్తాం. ఇలాంటి డ్రస్సులు ఫైనల్ చేస్తాం. కొన్ని సార్లు అందిరి నుండి సమ్మతి లబిస్తుంది కొన్నిసార్లు రాదు. చూడండి మేము డ్రస్ వేసుకొనేది మా కోసం మాత్రమే.. మీ కోసం కాదు. నేను వెళ్ళిన పని గురించి ఆలోచిస్తాను వేసుకునే డ్రస్ గురించికాదు'' అంటూ డిప్లొమటిక్ గా చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది.

అమెరికా సోషల్ మీడియాలో జాతి ద్వేషం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. అటువంటివి ప్రోత్సహించడం మంచిదికాదు.. వీలైతే వాళ్ళకి వివేకము కలిగించేలా చేస్తే మంచిది కదా అని దీపిక మాటల సారాంశం. ఏమ్మా అమెరికన్ మీడియా.. వింటున్నారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/