Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్.. కాని చదవడం కుదర్లే

By:  Tupaki Desk   |   18 Oct 2017 1:30 PM GMT
స్టార్ హీరోయిన్.. కాని చదవడం కుదర్లే
X
బాలీవుడ్ లో హీరోలకు ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఉంటారో అదే తరహాలో హీరోయిన్స్ కి కూడా చాలా మంది అభిమానులు ఉంటారనే చెప్పాలి. ఎందుకంటే కొంత మంది హీరోయిన్స్ ఒక రెండు మూడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే చాలు ఇక వారు సినిమాలకు ఎండింగ్ చెప్పేంత వరకు ఛాన్సులు వస్తూనే ఉంటాయి. ఆ విధంగా మొదట్లో హిట్స్ అందుకొని ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర నాయికగా కొనసాగుతున్న వారిలో దీపిక పదుకొనె ఒకరు.

అమ్మడు మోడల్ గా మొదట్లో మెరిసినా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కూడా. అయితే ప్రస్తుతం ఎంత స్టార్ హోదాలో ఉన్న కూడా చాలా డీసెంట్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో లో కూడా అందరితో చాలా ఫ్రెండ్లిగా ఉంటుంది. రీసెంట్ గా ఆమెకు ఆత్మీయబంధువైన హేమమాలిని ఆటోబయోగ్రఫీ పుసక్తవిడుదల కార్యక్రమంలో దీపిక పాల్గొంది. ఈ వేడుక సోమవారం ముంబయిలో జరిగింది. ఈ వేడుకలో అమ్మడు తన జీవితం గురించి కొన్ని విషయాలను తెలిపింది. తను ఎక్కువగా చదువుకోలేదని చెబుతూ.. కేవలం ఇంటర్ వరకే చదువుకున్నాను. మా ఫ్యామిలీ కొంచెం మిడిల్ క్లాస్. సో.. అప్పుడు వారు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. తరువాత నేను ఇంటర్ కు వచ్చేసరికే మెడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. అందుకే అప్పుడు డిగ్రీ పూర్తి చెయ్యాలని అనుకున్నాను కానీ కుదరలేదు. దూరపు విద్యకు కూడా ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యా.. అని చెప్పింది.

ఇక తన ప్రస్తుతం చేస్తున్న హిస్టారికల్ మూవీ పద్మావతి సినిమా గురించి కూడా కొన్ని విషయాలను షేర్ చేసుకుంది దీపిక. పద్మావతి సినిమాలో నన్ను సెలెక్ట్ చేయడం నిజంగా నా అదృష్టం. కానీ హిస్టారికల్ సినిమాలో నటించడమంటే చాలా శ్రమతో కూడుకున్న పనంటూ.. పద్మావతి సినిమా కోసం ఎనిమిది నెలల పాటు నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొన్నాం. ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేరు అని దీపిక తెలిపింది.