Begin typing your search above and press return to search.

నాకేనా నీక్కూడా ఇస్తాడు హ్యాండు!

By:  Tupaki Desk   |   19 March 2020 1:00 PM GMT
నాకేనా నీక్కూడా ఇస్తాడు హ్యాండు!
X
ఆ ఇద్ద‌రిలో మూడొచ్చే `మూడు` కామ‌న్ విష‌యాలున్నాయి. ఆ మూడూ ఏవి? అంటే.. ఒక‌టి న‌వ్వు.. రెండు బోయ్ ఫ్రెండ్స్ ని మార్చేయ‌డం.. మూడు ట్యాలెంట్ తో ఏల‌డం.. అవును ఆ ఇద్ద‌రి `మూడు విష‌యాల‌` గురించి ఎంత చెప్పినా త‌క్కువే. న‌వ్వుతూనే న‌వ‌రసాల్ని పండించేస్తారంతే!

ఇదిగో ఈ ఫోటోనే అందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. ఓ అవార్డు ఫంక్ష‌న్ లో స‌ద‌రు భామ‌లిద్ద‌రూ చెవులు కొరికేసుకుంటున్నారిలా. మ‌రీ అంత‌గా ఏం గుస‌గుస‌లాడేసుకున్నారో కానీ.. ఆ ముఖార‌విందాల్లో న‌వ్వు చూస్తుంటే ఏదో ర‌హ‌స్య‌మే మాట్లాడేసుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇక కెరీర్ ప‌రంగా ఫాలోయింగ్ ప‌రంగా ఈ ఇద్ద‌రూ ది బెస్ట్. దీపికా పదుకొనే - అలియా భట్ కెరీర్ ప‌రంగా అన్నివేళ‌లా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత‌కీ ఈ ఫోటో ఎక్క‌డిది? అంటే.. గ‌తేడాది జీ సినీ అవార్డు వేడుక‌లో అలియా - దీపిక ఇద్దరూ రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో అద‌ర‌గొట్టిన‌ప్పటిది. ఆ ఇద్ద‌రూ అలా చెవిలో గుస‌గుస‌లాడేసుకుంటుంటే చూసేవాళ్లు మాత్రం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంత‌కీ ఏమిటా గుస‌గుస‌లు? ఎవ‌రి గురించి ముచ్చ‌ట‌? అని అడిగేస్తే.. ఆ ఇద్ద‌రి కామ‌న్ బోయ్ ఫ్రెండ్ ర‌ణ‌బీర్ గురించేనా? అంటూ సెటైర్లు ప‌డిపోతున్నాయి. ఇక ర‌ణ‌బీర్ తొలి ప్రేయ‌సి దీపిక‌కు అత‌డి ప్ర‌స్తుత ప్రేయ‌సి ఆలియా చాలా క్లోజ్. మ‌రి దీపిక .. క‌త్రిన లాంటి అంద‌గ‌త్తెల‌కు హ్యాండ్ ఇచ్చిన ర‌ణ‌బీర్ నే ఈ అమ్మ‌డు ఎందుకు ఎంపిక చేసుకుంది? అన్న‌దానికి ఇప్ప‌టికీ స‌రైన ఆన్స‌ర్ మాత్రం లేదు.

ఇక కెరీర్ ప‌రంగా చూస్తే.. ఈ ఇద్ద‌రూ వ‌రుస‌ సినిమాలతో బిజీ బిజీ. దీపిక న‌టించిన ఛపాక్ ఇటీవ‌లే రిలీజైంది. ఆ వెంట‌నే త‌దుప‌రి చిత్రంపైనా దీపిక దృష్టి సారించింది. అలాగే అలియా ఇటీవల తన పుట్టినరోజును జరుపుకుని త‌దుప‌రి షెడ్యూల్స్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సడక్ 2 - గంగూబాయి కతియావాడి అనే రెండు చిత్రాలతో బిజీగా ఉంది. ర‌ణ‌బీర్ తో క‌లిసి న‌టించిన బ్ర‌హ్మాస్త్ర కరోనా వ‌ల్ల వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.