Begin typing your search above and press return to search.

ఇక దీపికా- కత్రినా కలిసిపోయినట్టేనా

By:  Tupaki Desk   |   16 Dec 2016 9:30 AM GMT
ఇక దీపికా- కత్రినా కలిసిపోయినట్టేనా
X
సినీ ఇండస్ట్రీ అంటేనే అంత. సంవత్సరాల తరబడి కోల్డ్ వార్ చేసుకుంటారు. వీళ్లు జన్మలో కలవరు అనుకునేలోపు ప్యాచప్ అయిపోతారు. షారూక్- సల్మాన్ - కరీనా- ప్రియాంక - కరీనా- బిపాసా - సోనమ్- దీపికా తర్వాత కత్రినా- దీపికా కూడా ఈ న్యూ ఫ్రెండ్స్ లిస్ట్ లోకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. రణబీర్ కపూర్ పుణ్యమా అని ఈ ముద్దుగుమ్మలిద్దరూ కొన్నేళ్లుగా కనిపించని యుద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం హాట్ టాపిక్ ఆఫ్ ద బాలీవుడ్ అయింది.

దీపికాపదుకొన్- కత్రినా కైఫ్ కి డైరెక్ట్ గా అసలు పరిచయం కూడా లేదు. కానీ వీళ్ల మధ్య పచ్చగడ్డే కాదు ఏది వేసినా భగ్గుమంటది. కారణం రణబీర్ కపూర్. కెరీర్ మొదట్లో డిప్పీ- రణబీర్ కపూర్ గాఢంగా ప్రేమించుకొన్నారు. ఎప్పుడైతే సీన్ లోకి కత్రినా వచ్చిందో వెంటనే దీపికాకి టాటా చెప్పేసి క్యాట్ లవ్ లో మునిగిపోయాడు రణబీర్. కపూర్ బాయ్ ద్రోహం చేశాడంటూ ఆ మంటని టాక్ షోల్లో కూడా చూపించింది దీపికా. ఇక కత్రినా- దీపికా ఒకరి ఆఫర్స్ కి మరొకరు ఎర్త్ పెట్టుకొన్నారు కూడా.

ఈ లోపు బ్రేకప్ చెప్పిన దీపికాతో రణబీర్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి వరసబెట్టి సినిమాలు చేశాడు. దీంతో కత్రినా కోపం పీక్స్ కెళ్లింది. అప్పటిదాకా వెకేషన్స్ పార్టీసంటూ ఎంజాయ్ చేసిన లవ్ బర్డ్స్ కి బ్రేకప్ అయిపోయింది. కత్రినా కోసం దీపికాకి.. దీపికా వల్ల కత్రినాకి రణబీర్ బైబై చెప్పేశాడు. మరి అసలోడు సీన్లో లేనప్పుడు మనం మనం ఎందుకు కొట్టుకోవాలనుకున్నారో ఏమో రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్లో కత్రినా- దీపికా ఒకరికొకరు హాయ్ హాలో చెప్పుకున్నారట. ఓ అవార్డ్స్ ఫంక్షన్ తర్వాత షారూక్ ని కలవడానికి దీపికా వెళ్లడం అక్కడే కత్రినా ఉండటంతో వెంటనే షారూక్ ఇద్దరి మధ్య మాటలు కలిసేలా చేశాడట. డిప్పీ- క్యాట్స్ కూడా ఇగోలు పక్కనబెట్టేసి హగ్స్ ఇచ్చుకున్నారట. మరి ముద్దుగుమ్మల స్మైల్స్ ఇక్కడితో ఆగుతాయో.. కొత్త ఫ్రెండ్షిప్ కు దారి తీస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/