Begin typing your search above and press return to search.
దీపిక దాచుకుంది! ప్రియాంక దోచుకుంది!!
By: Tupaki Desk | 29 May 2017 4:27 AM GMT'రోమ్ లో ఉన్నపుడు రోమన్ లాగే ఉండాలి' అన్నది పెద్దలు చెప్పే మాట. ఇది ఏ ఒక్క రంగానికో కాదు.. ప్రతీ విషయానికి వర్తిస్తుంది. ఇక ఫిలిం ఇండస్ట్రీ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడికి తగ్గ భజన అక్కడ చేయాల్సిందే. ఓ చోట స్టార్ అయినంత మాత్రాన మరో ప్రాంతానికి వచ్చినపుడు జీరో నుంచి మొదలుపెట్టాల్సిందే.
ఇప్పుడు బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనేలను చూస్తే ఓ విషయం అర్ధమవుతుంది. బాలీవుడ్ భామలకు హాలీవుడ్ లో వెలిగిపోవాలనే డ్రీమ్స్ ఉండడం తప్పేమీ కాదు. దాన్ని నెరవేర్చుకునే అవకాశం.. దాదాపుగా ఒకే సమయంలో వీరిద్దరికీ వచ్చింది. హాలీవుడ్ ఛాన్స్ రాగానే.. ప్రియాంక గభాలున అమెరికాకి మకాం మార్చేసింది. అంతే కాదు.. అక్కడికి తగ్గట్లుగా తన డ్రెసింగ్.. బిహేవియర్ ను మార్చేసుకుంది. హాలీవుడ్ వెళ్లగానే టూ పీస్ బికినీల నుంచి అన్ని రకాలు వేసింది.. అందుకే బే వాచ్ ఫ్లాపైనా కూడా ఇంకా ప్రమోషన్లకు అమ్మడినే పిలుస్తున్నారు. పూర్తి స్థాయి వెస్ట్రన్ దుస్తుల్లో ఈమె అక్కడ కనువిందు చేస్తోంది.
కాని దీపిక మాత్రం రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ఫ్లాప్ కాగానే అసలు హాలీవుడ్ మీడియాలోనే కనిపించలేదు. ఇందుకు కారణం ఇక్కడి కమిట్మెంట్స్ కావచ్చు కానీ.. ప్రియాంక స్థాయిలో అల్లుకుపోలేదు. కవర్ పేజ్ లకు ఫోటో సెషన్స్ గట్రా లాంటివేమీ చేసే ప్రయత్నాలు పెద్దగా చేయలేదు. అందుకే ఇప్పుడు హాలీవుడ్ మీడియా దీపికను దాదాపుగా మర్చిపోతే.. ప్రియాంకకు మరో అవకాశం ఇప్పటికే వచ్చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/