Begin typing your search above and press return to search.
క్యా తమాషా హై గురూ!!
By: Tupaki Desk | 23 Nov 2015 5:30 PM GMTబాలీవుడ్ లో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం విడిపోవడం సర్వసాధారణం. సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్ - సల్మాన్ ఖాన్ -కత్రినా కైఫ్ లతో పాటు.. పలు జంటలకు ఇలాంటి అనుభవం బాగానే ఉంది. అయితే.. విడిపోయిన వాళ్లు మళ్లీ కలిసి సినిమాలు చేసిన సందర్భాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. సల్లూభాయ్-కత్రినాలు ఓ మూవీలో కలిసి కనిపించారంతే.
ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిన తమాషాలో నటించిన రణబీర్ కపూర్ - దీపికా పదుకొణేలు కూడా మాజీ లవర్సే అని తెలుసు. అయితే.. వీళ్లిద్దరూ కలిసి ఇంటిమేట్ సీన్స్ ఉంటే సినిమా చేయడం, వీళ్ల స్టోరీకి దగ్గరగా ఉండే ప్రేమించుకుని విడిపోయే స్టోరీతో మూవీ చేయడం కాస్త విచిత్రమైన విషయమే. దీనికి మించి ముద్దు సీన్ లలో కెమిస్ట్రీ పండించేసిన వీళ్ల డెడికేషన్ ని ఎంతైనా పొగడాలి. ఏదోలే సినిమాకోసం అన్నిటికీ ఒప్పేసుకుని చేసేశారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రచారంలో కూడా ఇలాగే రెచ్చిపోతున్నారు ఈ తమాషా లవర్స్. ఢిల్లీ నుంచి ముంబై కి ట్రైన్ జర్నీ చేసేశారు. ఇంతియాజ్ ఆలీని పక్కన పెట్టుకుని మరీ.. ఈ లాంగ్ జర్నీలో పాలు పంచుకున్నారు. ఈ ప్రయాణంలో తోటి ప్రయాణికులతో రణబీర్ దీపికలు చేసిన సందడి, కంపార్ట్ మెంట్ లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
ఇంతగా ఓ సినిమా కోసం తమ పర్సనల్ ఫీలింగ్స్ ని పక్కన పెట్టేసిన జంట ఇప్పటివరకూ బాలీవుడ్ లో ఎవరూ లేరు. విడిపోవడం ఎలాగూ అయిపోయింది. ఇప్పుడు దాన్ని తలుచుకుని ఎందుకు ఫీల్ అవ్వడం అంటున్నారు వీళ్లిద్దరూ. అనడమే కాదు.. ఆ చెప్పే కబుర్లకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవును... వీళ్లిద్దరూ ఖచ్చితంగా ఆదర్శ మాజీ లవర్స్ జంటే.. కాదంటారా..